close

తాజా వార్తలు

Published : 01/03/2020 09:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. సంపూర్ణ సహకారం

తెలంగాణలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)ల ఛైర్మన్‌, ఉపాధ్యక్ష పదవులన్నింటినీ తెరాస మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. మొత్తం తొమ్మిది డీసీసీబీలు, తొమ్మిది డీసీఎంఎస్‌లలో ఏకగ్రీవంగా వారు ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు (టీఎస్‌క్యాబ్‌), రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (మార్క్‌ఫెడ్‌) ఛైర్మన్‌, ఉపాధ్యక్ష పదవులకు మార్చి మూడో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. రాబడి లెక్కతప్పింది

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు ఆశించిన రెవెన్యూ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు సగం కూడా దక్కలేదు. ఇది మొత్తం బడ్జెట్‌ ఖర్చులపై ప్రభావం చూపించింది. ఈ ఏడాదిలో రూ.1,78,697.42 కోట్లు వస్తుందని అంచనా వేస్తే.. జనవరి నెలాఖరుకు రూ.85,987.04 కోట్లే వచ్చింది. అంచనాతో పోలిస్తే ఇది 48.12% మాత్రమే. గత సంవత్సరం కంటే ఈసారి మరింత వెనకబాటు కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. రాజధానిలో డివిజన్ల పెంపు!

హైదరాబాద్‌ మహానగర రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. జీహెచ్‌ఎంసీ కొత్త చట్టం వచ్చాక రాజధానిలో డివిజన్ల సంఖ్యను పెంచాలని యంత్రాంగం ప్రణాళిక రచిస్తోంది. కనీసం ప్రతి 50 వేల మంది జనాభాకు ఓ డివిజన్‌ ఉండాలని భావిస్తోంది. ప్రస్తుతం 150 డివిజన్ల పరిధిలో దాదాపు కోటి మంది జనాభా ఉండటం గమనార్హం. ఆ లెక్కన డివిజన్లు 180 నుంచి 200కు పెరిగే అవకాశముంది. నవంబరు, 2020కి ఈ ప్రక్రియను ముగించి, వెంటనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలనేది ప్రణాళిక. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. అతడిది హత్యే... పథకం ఆమెదే!

గద్వాలలోని బురదపేటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి కార్తీక్‌ (31) దారుణహత్యకు గురైనట్టు పోలీసులు శనివారం ధ్రువీకరించారు. ఇతర మిత్రులతో కలిసి హత్యకు పథకం రచించిన అతడి స్నేహితురాలు రాగసుధ ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. కేసు పూర్వాపరాలను గద్వాల డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ జక్కుల హనుమంతు శనివారం విలేకరులకు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. రాయితీ రుణాలు ఆపేద్దాం!

ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ తదితర కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం ఇచ్చే రాయితీ రుణాల జారీ ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. రాయితీ రుణాలకు బదులుగా నేరుగా నగదు అందించడం లేదా ఇతర పథకాలు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. మనువు మారుతోంది!

పెళ్లంటే జీవితంలో ఒక్కసారే జరిగే శుభకార్యం. అది ఒకప్పుడు. కాలం మారింది. వధూవరుల ఆలోచనలు మారాయి. నచ్చకపోతే విడిపోవడమే. మరొకరిని వరించడమే. ఇదీ నేటి ధోరణి. ఒకప్పుడు రెండో పెళ్లంటే ఆక్షేపణ. ఇప్పుడది తప్పు కాదు. తొలి వివాహం విఫలమైతేనేం? అదొక పీడకలగా మర్చిపోతారు. మళ్లీ పెళ్లికి సిద్ధమవుతారు. ఇలాంటి వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులో నడి వయసు వారూ ఉంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. అఫ్గాన్‌లో శాంతి వీచికలు!

ఏళ్లుగా రక్తపుటేర్లు పారిన నేలపై శాంతి కుసుమాలకు బీజాలు పడ్డాయి. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉండి.. పరస్పరం భీకరదాడులు జరుపుకొన్న అమెరికా, తాలిబన్‌ ఒకే వేదికపైకి వచ్చాయి. చేయి చేయి కలిపాయి. చరిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకాలు పెట్టాయి. షరతులకు కట్టుబడుతూ హింసకు దూరంగా తాలిబన్లు ఉండాలని, అప్పుడే తమ బలగాలను వెనక్కి తీసుకుంటామని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. నా దేశం బ్రిటన్‌... నా సంస్కృతి భారతీయం!

మనవాళ్లు బ్రిటన్‌లోనూ వెలిగిపోతున్నారు. టెక్నాలజీ రంగంలో కాదు, రాజకీయాల్లో. ఇటీవల అక్కడ కొలువుదీరిన ప్రభుత్వంలో ముగ్గురు భారత సంతతి వ్యక్తులు  మంత్రులయ్యారు. వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి రిషి సునక్‌. 39 ఏళ్లకే ఆర్థిక మంత్రి(ఛాన్సలర్‌ ఆఫ్‌ ది ఎక్స్‌చెకర్‌) అయ్యారు రిషి. అక్కడ ప్రధాని తర్వాత కీలకమైన పదవి ఇదే.  పిన్న వయసులోనే ఈ స్థాయిని చేరుకోవడానికి రిషి చేసిన ప్రయాణం గురించి ఏం చెబుతారంటే... పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

9. ప్రపంచ అంటువ్యాధిగా అప్పుడే ప్రకటించలేం

కరోనా (కొవిడ్‌-19)కు కళ్లెం వేసేందుకు ఒకపక్క ఇంకా ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో దీనిని ‘ప్రపంచ అంటువ్యాధి’గా ప్రకటించడం ఉపయోగకరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చెందిన ‘ఆరోగ్య అత్యవసర కార్యక్రమం’ కార్యనిర్వాహక సంచాలకుడు మైఖేల్‌ ర్యాన్‌ అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. 235 పరుగులకు న్యూజిలాండ్‌ ఆలౌట్‌

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. రెండో రోజు 63/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌ కొనసాగించిన కివీస్‌ జట్టు 235 పరుగులకు ఆలౌటైంది. లేథమ్‌(52), జేమిసన్‌ (49), బ్లండెల్‌(30) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. భారత బౌలర్లలో షమి 4, బుమ్రా 3. జడేజా 2.. ఉమేశ్‌ యాదవ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 242 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌ ముగిసేసరికి కివీస్‌పై భారత్‌ 7 పరుగుల ఆధిక్యంలో ఉంది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.