close

తాజా వార్తలు

Published : 29/02/2020 19:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎనిమిది నెలల గర్భంతో అసెంబ్లీ సమావేశాలకు..

ముంబయి: తమకు ఓటేసి గెలిపించిన ప్రజల సమస్యలు ప్రభుత్వానికి నివేదించేందుకు ప్రజాప్రతినిధులకు సరైన వేదిక చట్ట సభలు. అందుకే పార్లమెంటు, శాసనసభ సమావేశాలు నిర్వహించినప్పుడు ప్రజాప్రతినిధులు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రభుత్వానికి విన్నవిస్తుంటారు. తద్వారా ఆయా సమస్యల పరిష్కారానికి అవకాశం లభిస్తుంది. కొంతమంది ప్రజాప్రతినిధులు చిన్నచిన్న కారణాల వల్ల కీలకమైన సమావేశాలకు డుమ్మా కొడుతుంటారు. మరికొంతమంది మాత్రం ఎన్ని సమస్యలు ఉన్నా సరే తమ ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమావేశాలకు హాజరవుతుంటారు. అదే పని చేశారు మహారాష్టకు చెందిన ఎమ్మెల్యే నమిత ముందాడ. ఎనిమిది నెలల గర్భవతి అయినప్పటికీ శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. అందరి చేత శభాష్‌ అనిపించుకుంటున్నారు.

‘నేను కూడా అందరు గర్భవతుల్లాగే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూనే ఎమ్మెల్యేగా నా విధులు కూడా నిర్వర్తిస్తున్నాను. బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరై నా నియోజకవర్గ ప్రజల సమస్యలపై మాట్లాడటం నా బాధ్యత’ అని ఆమె పేర్కొన్నారు. ఒకప్పుడు భ్రూణ హత్యలతో అపఖ్యాతి మూటగట్టుకున్న బీడ్‌ నియోజకవర్గం నుంచి గెలిచిన మహిళ ఎమ్మెల్యే ఇలా అందరికీ ఆదర్శంగా మారడంతో.. ఆ ఎమ్మెల్యే శభాష్‌ అంటూ ప్రజలు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి అయిన నమిత బీడ్‌ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యురాలిగా 2019లో భాజపా తరఫున ఎన్నికయ్యారు.

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.