close

తాజా వార్తలు

Published : 29/02/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. నాలుగేళ్లకోసారి వస్తుంది.. నలుగురిలో ప్రత్యేకత ఇస్తుంది..

అందరూ ఏటేటా జన్మదిన వేడుకలు చేసుకుంటుంటే ఈ రోజున పుట్టిన వారు మాత్రం నాలుగేళ్లకోసారే. అందుకే ఫిబ్రవరి 29న పుట్టినవారికి గుర్తింపు. పుట్టినరోజుల పరంగా వయసు లెక్కేస్తే 64 ఏళ్ల బామ్మకి పదహారేళ్లే... ఇలా అనుకుంటూ సంబరపడే వారూ ఉంటారు. నాలుగేళ్లకోసారి వచ్చే ఫిబ్రవరి 29 కోసం ఎదురుచూసి అదేరోజు ఘనంగా వివాహ, జన్మదిన వేడుకలు చేసుకుంటారు. నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తారు. హైదరాబాద్‌లో ఉన్న అరుదుగా కనిపించే ఇలాంటి ప్రత్యేక వ్యక్తులను ‘ఈనాడు’ పలకరించింది.. నేడు లీపు దినం సందర్భంగా ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి 

2. ఉమ్మడి ఏపీని దాటేసిన తెలంగాణ

తెలంగాణ విద్యుత్‌ రంగం మరో రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోజువారీ విద్యుత్‌ డిమాండు శుక్రవారం 13,168 మెగావాట్లు నమోదైంది. అలాగే చరిత్రలో ఎన్నడూ లేనంతగా తలసరి విద్యుత్‌ వినియోగం నమోదవడం మరో రికార్డు అని ట్రాన్స్‌కో వెల్లడించింది. గతంలో 23 జిల్లాలు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో 2014 మార్చి 23న గరిష్ఠ డిమాండ్‌ 13,162 మెగావాట్లుగా నమోదైందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. నేడే డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ ఎన్నికలు

తెలంగాణలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌)లలో ఛైర్మన్‌, ఉపాధ్యక్ష పదవులకు శనివారం ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ పదవులన్నీ తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులకు దక్కనున్నాయి. పార్టీ  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పేర్లను సీఎం కేసీఆర్‌కు అందజేయగా ఆయన వాటికి ఆమోదం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. చికెన్‌, గుడ్డు రోజూ తింటున్నాం

చికెన్‌, గుడ్డు వల్ల కరోనా వస్తుందనేది అపోహ మాత్రమేనని, తాము ప్రగతి భవన్‌లో రోజూ వాటిని తింటున్నామని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. వీటిలో లభించినన్ని పోషకాలు మరే ఆహారంలోనూ ఉండవన్నారు. కోడికూర, గుడ్డు తినడం వల్ల కరోనా వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో.. అది కేవలం అపోహ మాత్రమేనని ప్రకటించేందుకు శుక్రవారం హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో చికెన్‌, ఎగ్‌ మేళా నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఆర్టీసీ సిబ్బందికి నీలిరంగు దుస్తులు

ఏపీఎస్‌ఆర్టీసీ సిబ్బంది ఏళ్ల తరబడి వినియోగిస్తున్న ఖాకీ దుస్తుల స్థానంలో లేత నీలిరంగు దుస్తులను ప్రవేశపెట్టనున్నామని సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ తెలిపారు. శుక్రవారం విశాఖలోని వాల్తేరు డిపోలో మన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే చిత్రాలతో కూడిన నవీకరించిన బస్సులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని జిల్లాల నుంచి విశాఖకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా రాత్రి వేళల్లో డాల్ఫిన్‌ క్రూయిజ్‌ అనే కొత్త బస్సులను నడుపుతామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. పల్లెపల్లెకూ హైందవ ధర్మ ప్రచారం

తితిదే ఆధ్వర్యంలోని హింధూ ధర్మ ప్రచార పరిషత్‌ (హెచ్‌డీపీపీ), సమరసత సేవా ఫౌండేషన్‌తో కలిసి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామగ్రామాన సనాతన హైందవ ధర్మాన్ని ప్రచారం చేయాలని తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీలు, ఆవాసాల్లో ఒక్కోఆలయానికి రూ.10లక్షలు వెచ్చిస్తూ..మరో 500 దేవాలయాలను నిర్మించాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. చదువుకోండి.. వ్యాపారవేత్తలుగా ఎదగండి

అంకుర సంస్థలను ఏర్పాటు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు జేఎన్‌టీయూహెచ్‌ కీలక సంస్కరణలు తీసుకురాబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన అంకుర (స్టార్టప్‌) పాలసీ అమలుకు సిద్ధమవుతోంది. ఇందులో విద్యార్థులకు పలు ప్రయోజనాలు అందించనుంది. స్టార్టప్‌లు ఏర్పాటు చేసే విద్యార్థులకు ఏడాది సెలవు, క్రెడిట్స్‌ ఇవ్వాలని భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. నేడు గిన్నిస్‌ రికార్డులతో మోతెక్కనున్న ప్రయాగ్‌రాజ్‌

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ ఐదు అరుదైన గిన్నిస్‌ రికార్డులకు వేదికగా నిలవనుంది. వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన ప్రత్యేక ఉపకరణాలను పంపిణీ చేసేందుకుగాను అక్కడి పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందులో స్వయంగా పాల్గొంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. సెమీస్‌కు ముందు భలే ఛాన్స్‌

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే సెమీఫైనల్‌ చేరిన భారత్‌కు లోపాలు సరి చేసుకోవడానికి ఆఖరి అవకాశం! మరికాసేపట్లో హర్మన్‌ బృందం శ్రీలంకతో లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ నామమాత్రమే కానీ.. జట్టులోని స్టార్‌ క్రికెటర్లు గాడిన పడేందుకు చక్కటి అవకాశం కల్పిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్ట్‌ కొనసాగుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు నాలుగు వికెట్లు కోల్పోయింది. పృథ్వీషా(54), మయాంక్‌(7), కోహ్లీ(3), రహానె(7) ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో పుజారా, హనుమా విహారి ఉన్నారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.