close

తాజా వార్తలు

Published : 28/02/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. ఆవిష్కరణల ఊతం

అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఆరోగ్య సంరక్షణ సంస్థ ప్రావిడెన్స్‌ ప్రపంచ ఆవిష్కరణల కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీరామారావు చేతుల మీదుగా గురువారం ప్రగతిభవన్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.దీనిని నాలుగేళ్లలో రూ.700 కోట్ల పెట్టుబడులతో పాటు రెండువేల మందికి ఉపాధి కల్పిస్తామని సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రావిడెన్స్‌ను స్వాగతించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. శాంతిభద్రతల పరిస్థితి భయానకం

పోలీసుల అనుమతి ఉన్నా ప్రజా చైతన్య యాత్రను అడ్డుకున్నారంటే.. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోందని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. తన పర్యటనను అడ్డుకునేందుకు ఇతర జిల్లాల నుంచి వైకాపా కార్యకర్తలను తరలించడం హేయమైన చర్య అని గురువారం రాత్రి ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఇళ్ల స్థలాలకు ఇచ్చే అధికారం మీకెక్కడిది?

ఏపీ రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూముల్లో నిబంధనల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టకుండా... వాటిని ఇళ్ల స్థలాలకు కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడుందని హైకోర్టు ప్రశ్నించింది. అభివృద్ధి పనులు చేపట్టాక... సమీకరించిన భూమిలో 5శాతం భూమిని పేద ప్రజల ఇళ్ల నిర్మాణ పథకానికి కేటాయించాలని సీఆర్‌డీఏ చట్ట నిబంధనలు చెబుతున్నాయని గుర్తుచేసింది. అభివృద్ధి పనుల బాధ్యతను నిర్వర్తించకుండా ప్రభుత్వం ఏకపక్ష చర్యలు తీసుకోజాలదని వ్యాఖ్యానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. పోలీసుల పనితీరుపై అభిప్రాయ సేకరణ

తెలంగాణ పోలీసు సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరిచేందుకు పోలీస్‌స్టేషన్ల వారీగా ఫోకస్‌ గ్రూపులు ఏర్పాటు కానున్నాయి. ఈ బృందాల్లో ఆయా ఠాణాల పరిధిలోని యువత, రైతులు, కార్మికులు, వయోధికులు, ఉపాధ్యాయులు, మహిళలు, విద్యార్థులు ఉంటారు.ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేసి ఈ బృందాల్లోని సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతారు. పోలీసు సిబ్బంది పనితీరుపై వీరి నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ట్విటర్‌, వాట్సప్‌, టిక్‌టాక్‌లపై కేసు

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సామాజిక మాధ్యమాలు ట్విటర్‌, వాట్సప్‌, టిక్‌టాక్‌లపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అసాంఘిక శక్తులు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రెండు వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రదర్శనలు, వ్యాఖ్యలను వీడియోలు, చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారంటూ పాత్రికేయుడు సిల్వేరి శ్రీశైలం నాంపల్లి కోర్టులో కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీంతో వాటిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. అయ్యో.. కోడి

దేశీయంగా కోడిమాంసం విక్రయాలు గత నెల రోజుల్లో 50 శాతానికి పైగా క్షీణించాయని గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌ మేనేజింగ్‌ డైరెక్టరు బి.ఎస్‌.యాదవ్‌ తెలిపారు. కోడి మాంసం తింటే కరోనా వైరస్‌ సోకుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రబలుతున్న వదంతులే ఇందుకు కారణమయ్యాయని చెప్పారు. ఫలితంగా ధర 70% వరకు పతనమైందని, కోడి కిలో ధర రూ.100 నుంచి రూ.30-35కి పతనమైందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఆర్టీసీ బస్సులో భీష్మ చిత్ర ప్రదర్శన

యువ కథానాయకుడు నితిన్‌ నటించిన కొత్త చిత్రం భీష్మ పైరసీ బారిన పడింది. హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సులోని టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తుండగా ఓ ప్రయాణికుడు తన మొబైల్‌లో చిత్రీకరించి ట్విటర్‌ ద్వారా ఆ చిత్ర బృందానికి పంపించాడు. నటుడు నితిన్‌ ఈ విషయాన్ని ఫిలిం ఛాంబర్‌లోని పైరసీ వ్యతిరేక విభాగం దృష్టికి తీసుకెళ్లారు. ఆ విభాగం ప్రతినిధులు గురువారం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ పెద్ద మనసు

ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సుధా నారాయణమూర్తి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కర్ణాటకలోని వెయ్యి ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు, ఇతర ఉపకరణాలను అందించేందుకు మొదటి విడతగా గురువారం రూ.18 కోట్ల విరాళం ప్రకటించారు. తదుపరి దశల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లను అభివృద్ధి చేసేందుకు తమ ఫౌండేషన్‌ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. మొబైల్‌ డేటా ఛార్జీలు 7- 8 రెట్లు పెంచాలి

సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్‌) బకాయిల చెల్లింపుల విషయంలో వొడాఫోన్‌ ఐడియా మరోసారి తన అశక్తత  ప్రకటించింది. సంక్షోభంలో చిక్కుకున్న టెలికాం రంగానికి ప్రభుత్వం తక్షణ ఉపశమన చర్యలు ప్రకటిస్తే మినహా, పూర్తి బకాయిలు చెల్లించడం ఇప్పుడైతే తమ వల్ల కాదని టెలికాం విభాగానికి (డాట్‌) రాసిన లేఖలో స్పష్టం చేసింది. మొబైల్‌ డేటా ఛార్జీలను ప్రస్తుతంతో పోలిస్తే 7-8 రెట్లు పెంచాలి, ప్రస్తుతం 1 జీబీ డేటాకు రుసుము రూ.4-5 మాత్రమే. దీన్ని రూ.35 చేయాలంటూ పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ‘ప్రత్యేకంగా అసెంబ్లీ సీట్ల పెంపు అవకాశం లేదు’

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.