close

తాజా వార్తలు

Published : 25/02/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. విందుకు మన్మోహన్‌ దూరం

ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ఇవ్వనున్న విందుకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హాజరు కావడం లేదు. ఆహ్వానం అందుకున్న ఆయన... తాను విందుకు రాలేకపోతున్నానని విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి కార్యాలయానికి సమాచారం అందించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాకు ఆహ్వానం అందలేదని, అలాంటప్పుడు తాము విందులో ఎలా పాల్గొంటామని ఆజాద్‌ పేర్కొన్నట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. పిల్లలకు నేనిచ్చే ఆస్తి చదువే

‘రాష్ట్రంలోని పిల్లలందరికీ నేనిచ్చే ఆస్తి ఒక్క చదువే. అదే చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎన్నో కుటుంబాలను పేదరికం నుంచి బయట పడేస్తుంది. అందుకే.. ఎన్ని కష్టాలెదురైనా, ఎంత ఖర్చయినా కోట్ల రూపాయలను వారి చదువు కోసం వెచ్చిస్తున్నా’ అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని విజయనగరంలో సోమవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ప్రగతిని పరిచయం చేద్దాం

జీహెచ్‌ఎంసీలో అమలు చేస్తున్న ‘పరిచయం’ కార్యక్రమాన్ని అన్ని పురపాలికల్లో అమలు చేయనున్నట్లు మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. హైదరాబాదులో బ్రహ్మాండంగా అమలుచేస్తున్న ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పరిచయం చేసుకొని, తమ ఫోన్‌ నంబరు ఇస్తారన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయకపోతే వారు చెత్తను సేకరించబోరని చెప్పారు. ప్రజల్లో ఈ మార్పు రావాలన్నారు. మహబూబ్‌నగర్‌లో సోమవారం పట్టణ ప్రగతి ప్రణాళిక ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వీఆర్వో వ్యవస్థ నుంచే ప్రక్షాళన!

 తెలంగాణ రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు నడుం బిగించిన ప్రభుత్వం తొలుత గ్రామ రెవెన్యూ అధికారులను (వీఆర్వో) ఆ శాఖ నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమవుతోంది. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించి అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్తచట్టం నుంచి వీఆర్వోలను మినహాయించాలని భావిస్తోంది. వీరిని పంచాయతీరాజ్‌ శాఖకు బదలాయించి ఆ శాఖ పరిధిలో కార్యదర్శులు లేదా అర్హతలను బట్టి ఏవైనా పోస్టులను కేటాయించాలని యోచిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. విశాఖలో ట్రామ్‌ కారిడార్లు

విశాఖలో మెట్రోతోపాటు 60.2 కిలో మీటర్ల పొడవున అధునాతన ట్రామ్‌ కారిడార్ల (ఎంటీసీ) కోసం సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు మార్గాల్లో ఏర్పాటు చేసే కారిడార్ల కోసం డీపీఆర్‌ తయారీకి డీఎమ్మార్సీ, రైట్స్‌, యూఎంటీసీ నుంచి కొటేషన్లను ఆహ్వానించేందుకు అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌కి అనుమతిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. రణరంగమైన దిల్లీ

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక ఉద్యమాలతో సోమవారం ఈశాన్య దిల్లీ దద్దరిల్లింది. ఆందోళనకారుల ఆగ్రహజ్వాలలు ఒక హెడ్‌కానిస్టేబుల్‌ సహా నలుగురిని బలితీసుకున్నాయి. నిరసనకారులు రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. ఆస్తులకు నిప్పు పెట్టారు. పెట్రోల్‌ బంకు సహా ఇళ్లు, వాహనాలను ధ్వంసం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యాప్‌

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌ యోజన) పథకం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా దానికి సంబంధించిన మొబైల్‌ యాప్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ సోమవారం దిల్లీలో ఆవిష్కరించారు. రైతులకు ఈ పథకాన్ని మరింత చేరువ చేసేందుకు ఈ యాప్‌ను తీసుకొచ్చినట్లు మంత్రి చెప్పారు. దీని ద్వారా ఖాతాలో నగదు జమ వివరాలు, పేరు, చిరునామా మార్పులతో పాటు హెల్ప్‌లైన్‌ సేవలను పొందవచ్చని  తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. కామన్వెల్త్‌లో షూటింగ్‌, ఆర్చరీ!

భారత్‌ పట్టుదలే నెగ్గింది.. 2022 బర్మింగ్‌హమ్‌ కామన్వెల్త్‌ పోటీల్లో షూటింగ్‌ను తొలగించడం.. ఆర్చరీని ఐచ్ఛిక ఆటగా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఈ మెగా ఈవెంట్‌ను బహిష్కరిస్తామని మన దేశం చేసిన ప్రకటనకు కామన్వెల్త్‌ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్‌) దిగొచ్చింది. ఈ నేపథ్యంలో జనవరి 2022లో చండీగఢ్‌లో షూటింగ్‌, ఆర్చరీ పోటీలను నిర్వహించే అవకాశం భారత్‌కు దక్కింది. తాజాగా సీజీఎఫ్‌ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. పసిడి @ 45000

బంగారం ధర కొనుగోలుదార్లకు చుక్కలు చూపిస్తోంది. సోమవారం ఒక్కరోజే దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల మేలిమిబంగారం ధర రూ.953 పెరిగి రూ.44,472కు చేరింది. హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో సాయంత్రానికి రూ.45,000 అధిగమించింది. కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) వల్ల మరణాలు మరికొన్ని దేశాల్లో సంభవించడంతో, స్టాక్‌మార్కెట్ల నుంచి నిధులు పసిడిపైకి రావడం వల్లే బంగారం ధర గణనీయంగా పెరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. తాజ్‌మహల్‌ను సందర్శించిన ట్రంప్‌ దంపతులు

 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.