close

తాజా వార్తలు

Updated : 23/02/2020 09:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. వడోదరాలో ప్రమాదం 12 మంది మృతి

గుజరాత్‌లోని వడోదరా జిల్లా మహువాడ్‌ గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, టెంపో ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని జిల్లా ఎస్పీ సుధీర్‌ దేశాయ్‌ తెలిపారు. క్షతగాత్రులను వడోదరాలోని ఎస్‌ఎస్‌జీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

2. కాగజ్‌నగర్‌ పేపర్‌మిల్లులో ప్రమాదం

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లులో శనివారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ ప్లాంట్‌ కోసం జరుగుతున్న బాయిలర్‌ నిర్మాణం పనుల్లో ఒక్కసారిగా మట్టి దిబ్బలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతిచెందాడు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. నెలాఖరులోగా బడ్జెట్‌ ముసాయిదా

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ముసాయిదాను వెంటనే సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించాలన్నారు. ఈ నెలాఖరు వరకు సిద్ధం చేయాలని సూచించారు. ఈ నెల 24 నుంచి పట్టణ ప్రగతిని పెద్దఎత్తున చేపట్టాలని సీఎం సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. పెట్టుబడులపై గట్టి దెబ్బ

తాడేపల్లి నుంచి మంగళగిరి, కాజ వరకు గత నాలుగేళ్లలో నిర్మాణ రంగంలో కొన్ని వందల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.  ఏపీ రాజధాని ఇక్కడే కొనసాగితే ఆ ప్రాంతంలో భారీ వాణిజ్య, నివాస సముదాయాల నిర్మాణానికి, గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టులు చేపట్టేందుకు చాలా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. మూడు రాజధానుల ప్రకటనతో పరిస్థితి తలకిందులైంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు హైదరాబాద్‌, బెంగళూరు వంటి ప్రాంతాలకు తరలిపోతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

5. ఆర్టీసీలో సమ్మెలు.. ప్రదర్శనలు నిషేధం

ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజారవాణా శాఖ ఉద్యోగులు సమ్మెలు, ప్రదర్శనల్లో పాల్గొనకూడదని ఏపీఎస్‌ఆర్టీసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మీడియా ముందు ప్రభుత్వ నిర్ణయాలను, అధికారులను విమర్శించకూడదని అందులో స్పష్టం చేసింది. ట్రేడ్‌ యూనియన్ల చట్టం-1926, పారిశ్రామిక వివాదాల చట్టం- 1947 ఉద్యోగులకు వర్తించబోవని ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. న్యూజిలాండ్‌ 348 ఆలౌట్‌

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 348 పరుగుల వద్ద కివీస్‌ ఆలౌటైంది. విలియమ్సన్‌ 89, రాస్‌ టేలర్‌ 44, జేమీసన్‌ 44, గ్రాండ్‌హోమ్‌ 43 రాణించారు. భారత బౌలర్లలో ఇషాంత్‌ శర్మ 5, అశ్విన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, షమి చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా165 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. మూడున్నరేళ్లలో రామాలయం పూర్తి

అయోధ్యలో ప్రతిపాదిత రామాలయం పనులు ప్రారంభించిన మూడున్నరేళ్లలో పూర్తి చేస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పేర్కొంది. ఆలయ నిర్మాణానికి భక్తుల నుంచి సహాయ సహకారాలు కోరతామని వెల్లడించింది. ట్రస్టు కోశాధికారి గోవింద్‌ దేవ్‌ గిరి శనివారం జైపుర్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రజల నుంచి ఇటుకలతో సహా ఆర్థిక రూపంలో సహాయం తీసుకుని రామాలయ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. సంబంధాల బలోపేతానికే

భారత్‌- అమెరికాల మధ్య ఉన్న సుదృఢ, సుస్థిర సంబంధాల కొనసాగింపునకు సూచికగా డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన ఉంటుందని అధ్యక్షుడి కార్యాలయమైన ‘శ్వేత సౌధం’ ప్రకటించింది. ట్రంప్‌ భారత్‌లో జరపనున్న తొలి అధికారిక పర్యటనపై శుక్రవారం శ్వేత సౌధం ఉన్నతాధికారి ఒకరు విలేకరులతో ముచ్చటించారు. తన పేరును బహిర్గతం చేయొద్దంటూ ఆయన పలు విషయాలను వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి 

9. కాంగ్రెస్‌లో రాహులే నంబర్‌ వన్‌: ఖుర్షిద్‌

రాహుల్‌ గాంధీయే కాంగ్రెస్‌లో అగ్రనేత అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షిద్‌ వ్యాఖ్యానించారు. రాహుల్‌ మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాలని తమ పార్టీలోని మెజారిటీ వర్గం కోరుకుంటోందని చెప్పారు. అయితే, రాహుల్‌ గాంధీకి సొంతంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం కల్పించాలని అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీ ఉన్నంత వరకూ కాంగ్రెస్‌లో నాయకత్వానికి ఎలాంటి కొరతా ఉండదని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. అమెరికా అధ్యక్షుడికి ఆగ్రా మేయర్ అరుదైన కానుక

 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.