close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 17/02/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యంత్ర దండం

రూ.2వేలకు బదులు  
రూ.300 చాలు

ఎకరం పత్తిలో కాండం పూత మందు పూయడానికి కూలీలకు రూ.2 వేల వరకు ఖర్చు అవుతుంది. అదే గిరిజన యువ రైతు ఆత్రం సుంగు తయారు చేసిన యంత్రం ద్వారా రూ.300 ఖర్చుతో కాండం పూత మందు పూయవచ్చు. అదీ ఒక రోజులోనే. ఈ ప్రతిభను మెచ్చి ప్రభుత్వం యంత్ర లక్ష్మి పురస్కారాన్ని ఆయనకు అందించింది.
సమస్యలు, ప్రతికూల పరిస్థితులే నూతన ఆవిష్కరణలకు బీజం వేస్తాయి. ఆత్రం సుంగు తయారు చేసిన యంత్రం ఇలా పుట్టిందే. పెరుగుతున్న సాగు వ్యయం, కూలీల కొరత ఆయన్ను ఈ వైపు ఆలోచించేలా చేశాయి. కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం మాణిక్యాపూర్‌ గ్రామానికి చెందిన ఆత్రం సుంగు ఓపెన్‌ డిగ్రీ చదివారు. అగ్రికల్చర్‌ బీఎస్సీ చదవాలనుకున్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు. అయిదు ఎకరాల పత్తి చేనులో ఏటా కూలీల కొరత వేధించేది. దీన్ని అధిగమించడానికి ఆయన రోజూ ప్రయోగాలు చేస్తుండేవారు. పాత సైకిల్‌ హ్యాండిల్‌, పారక్‌, సైకిల్‌ రిమ్‌, నీళ్లబాటిల్‌ సహాయంతో సెలైన్‌ ఎక్కించే పైపులు, రెండు పెయింటింగ్‌ బ్రష్‌ల సాయంతో చిన్నపాటి యంత్రం రూపొందించారు. కూలీ దీన్ని పట్టుకొని నడుచుకుంటూ వెళితే పత్తి కాండంకు పూత మందు వేయవచ్చు. ఈ యంత్రంతో ఒకే రోజు మూడు ఎకరాల వరకు ఒక్కరే చేయొచ్చు. ఇది లేకపోతే అయిదుగురు కూలీలు ఒక రోజు 2 ఎకరాలకే పూత మందు పెట్టగలరు. ‘‘పత్తి పంటకు పంటకాలంలో మూడు సార్లు కాండానికి పూత పూయాల్సి ఉంటుంది. ఈ యంత్రం పని సులువు అవడంతో పాటు, కూలీల ఖర్చు తగ్గుతుంది. పైగా తేనెటీగలు, మిత్ర పురుగులు చనిపోవ’’ని సుంగు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.

           - మధుకర్‌, తిర్యాణి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.