close

తాజా వార్తలు

Updated : 12/02/2020 09:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. కరోనా వైరస్‌ కొత్తపేరు ‘కొవిడ్‌-19’

చైనా సహా పలు దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కొత్త తరహా కరోనా వైరస్‌కు ‘కొవిడ్‌-19’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నామకరణం చేసింది. కరోనా(సీవో), వైరస్‌(వీఐ), వ్యాధి(డీ) అనే పదాలకు సంక్షిప్త రూపంగా ఈ పేరును ఖరారు చేసింది. 2019 డిసెంబరులో చైనాలోని వుహాన్‌లో తొలిసారిగా ఈ వైరస్‌ ఉనికి బయటపడిన సంగతి గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. దిశ యాప్‌ ద్వారా తొలి కేసు నమోదు

బస్సులో మహిళతో అనుచితంగా ప్రవర్తించిన పోకిరీని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. దిశ యాప్‌లో అందిన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్రంలో నమోదైన తొలికేసు ఇది. యాప్‌లో ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని పట్టుకున్న తీరును డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మంగళవారం స్పందన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. పోలీసులను సీఎం అభినందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. కేకే ఓటుపై వివరణ ఇవ్వండి

తుక్కుగూడ మున్సిపాలిటీ ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ ఎన్నికల్లో ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఓటు వేయడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. భాజపా తరఫున ఎన్నికైన రాజుమోనిరాజు, మరో ఏడుగురు వార్డు సభ్యులు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ పి.కేశవరావు విచారణ చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. పోరాటానికి సిద్ధమవుదాం

ప్రజా సమస్యలపై పోరాటానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. కేసులు పెడతారని భయపడి ఇంట్లో ఉంటే రాష్ట్రం దెబ్బతినే పరిస్థితి వస్తుందన్నారు. గ్రామ, మండల, జిల్లా కమిటీలు నియమించుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. మంగళవారం విజయవాడలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. తెలంగాణలో తొలి సహజ సిద్ధ మురుగునీటి శుద్ధి కేంద్రం

తెలంగాణ రాష్ట్రంలో తొలి సహజసిద్ధ మురుగునీటి శుద్ధి కేంద్రం హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ మెటలర్జీ అండ్‌ న్యూ మెటీరియల్స్‌ (ఏఆర్‌సీఐ) కార్యాలయంలో ఏర్పాటైంది. ఫైటోరిడ్‌ స్వాబ్‌ (మొక్కల ఆధారంగా మురుగును స్వచ్ఛంగా మార్చే ప్రక్రియ) ఆధారిత కేంద్రాన్ని ఏఆర్‌సీఐ కార్యాలయంలో ఆ సంస్థ డైరెక్టర్‌ డా.జి.పద్మనాభం మంగళవారం ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఉరికి కొత్త తేదీని నిర్ణయించొచ్చు

నిర్భయ దోషుల మరణ శిక్ష అమలు విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కేంద్రం, దిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లు తమ వద్ద పెండింగులో ఉన్నప్పటికీ.. ఉరితీతకు విచారణ న్యాయస్థానం కొత్త తేదీని నిర్ణయించవచ్చని స్పష్టం చేసింది. విచారణ న్యాయస్థానాన్ని సంప్రదించే స్వేచ్ఛను అధికారులకు కల్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. కరోనాపై ఆందోళన వద్దు

కరోనా వైరస్‌ బారినుంచి భారతదేశం సురక్షితంగా ఉందని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) ఉపసంచాలకురాలు డాక్టర్‌ శిఖావర్ధన్‌ తెలిపారు. ఆమె నేతృత్వంలో విశాఖపట్నంలో రెండ్రోజులుగా ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో శిఖావర్ధన్‌తో ‘ఈనాడు’ ప్రత్యేకంగా మాట్లాడింది. దేశంలో కరోనా వైరస్‌ వ్యాపించకుండా వివిధ స్థాయుల్లో చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కంగారు పడాల్సిన అవసరంలేదని ఆమె చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమే

కేంద్ర ప్రభుత్వం సకాలంలో తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ స్పష్టమైన దిశలో ముందుకు వెళ్తోందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ స్పష్టంచేశారు. ఆర్థికలోటు, ప్రాథమిక లోటు, జీడీపీలో రుణ నిష్పత్తి అన్నీ పరిమితులకు లోబడే ఉన్నాయని, దీనివల్లే విదేశీ పెట్టుబడిదారుల్లో భారత్‌పట్ల విశ్వాసం పెరిగి దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయని ఆమె విశ్లేషించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ప్రజాకర్షక పథకాల పవర్‌

దేశ రాజధానిలో సగటు ఓటర్లకు ఏం కావాలి, ఎలాంటి పథకాలతో వారిని ఆకట్టుకోవచ్చు అనేవి గుర్తించగలిగిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)... తదనుగుణంగా రూపొందించిన ప్రణాళిక భారీగానే ఓట్లను రాబట్టగలిగింది. గెలిచిన, ఓడిన పార్టీలన్నీ ఇప్పుడు ప్రజాకర్షక పథకాల స్థాయిని పెంచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. మెరిసిన శ్రీకాంత్‌

ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. సింగిల్స్‌లో శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌, శుభాంకర్‌ డే గెలుపొందారు. డబుల్స్‌లో రెండో డబుల్స్‌లో అర్జున్‌-ధ్రువ్‌ కపిల విజయం సాధించారు. మరోవైపు మహిళల క్రికెట్‌లో ముక్కోణపు సిరీస్‌లో నేడు జరుగుతున్న ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ తలపడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.