close

తాజా వార్తలు

Published : 12/02/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సర్వాంతర్‌యాప్‌

ఇచ్చట అన్నీ దొరుకును..

తీరికలేని ఆఫీసు వేళలు..నిరంతర పని ఒత్తిడి..అంతంత మాత్రంగా శారీరక శ్రమ..చేస్తున్నపని మీద ఏకాగ్రత తగ్గడం..పెట్టుకున్న లక్ష్యాల్ని అందుకోలేకపోవడం..కాలానుగుణంగా అప్‌డేట్‌ కాలేకపోవడం..ఇలాంటి స్థితేనా మీది? అయితే, స్మార్ట్‌ఫోన్‌ అందుకోండి. యాప్‌ల సాయం తీసుకోండి! రోజూ వాటిని ఫాలో అయిపోండి. హోం స్క్రీన్‌పై లైఫ్‌కోచ్‌లా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి...


ఫిట్‌నెస్‌
ఎప్పుడూ ‘ఆన్‌’లోనే!
*
fiton

ఉన్నచోటే మీకున్న పరిమిత సమయంలోనే రోజూ వ్యాయామం చేస్తూ ఫిట్‌గా ఉండేందుకు సాయపడుతుంది. ఇదో ఉచిత సర్వీసు. యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని లాగిన్‌ అయితే చాలు. మీకో ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఉన్నట్టే.  మీరు ఎంచుకున్న ఫిట్‌నెస్‌ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తుంది. పలు రకాల వర్కవుట్స్‌ జాబితాలో కనిపిస్తాయి. రోజులో ఎప్పుడైనా మీకున్న పరిమిత సమయంలోనే సాధన చేయొచ్చు. 10 నిమిషాల నిడివిలో వర్కవుట్స్‌ ఉన్నాయి. న్యూట్రిషియన్‌ సలహాలతో తినే ఆహారంలోనూ జాగ్రత్తలు చెబుతుంది. ఫిట్‌నెస్‌ని ట్రాక్‌ చేయొచ్చు కూడా.


యోగా, ధ్యానం
మనసు ప్రశాంతం

* UCLAMindful

ఫిట్‌గా ఉండడం అంటే శారీరకంగా దృఢంగా ఉంటే సరిపోదు. మానసికంగా కూడా బలంగా మారాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం. అందుకే మనసుని ప్రశాంతంగా ఉంచేందుకు తగిన యాప్‌ ఇది. చేస్తున్నపని మీద, నేర్చుకునే అంశాల మీద ఏకాగ్రత సాధించేందుకు యాప్‌తో ధ్యాన సాధన చేయొచ్చు. కొత్త వారికి  ‘బేసిక్‌ మెడిటేషన్‌ టిప్స్‌’ ఉన్నాయి. తీవ్ర మానసిక ఒత్తిడి గురయ్యే వారికి ‘వెల్‌నెస్‌ మెడిటేషన్స్‌’ ఉపయోగపడతాయి. రోజూ కొంత సమయాన్ని సెట్‌ చేసుకుని సాధన చేయొచ్చు.
 


అవగాహన అవసరం
వెతికేందుకు వేదిక..

* wikihow

స్కూల్‌, కాలేజీల్లో చెప్పే పాఠాలే కాదు. కామన్‌సెన్స్‌తో కూల్‌గా బతికేందుకు అనేక విషయాలపై అవగాహన పెంచుకోవడం అనివార్యం. అందుకే మీకొచ్చే సందేహం, సమస్య.. ఏదైనా యాప్‌లో వెతకొచ్చు. నేర్చుకునేందుకు చక్కని వేదిక. విభాగాలవారిగా వ్యాసాలు ఉంటాయి. సెర్చ్‌ ద్వారా కావాల్సిన వాటిని వెతకొచ్చు. ఉదాహరణకు కారు టైర్‌ ఎలా మార్చాలి? గార్డెనింగ్‌ ఎలా చేయాలి?... ఇలా అనేక విషయాల్ని ఫొటోలు, వీడియోలతో వివరంగా తెలుసుకోవచ్చు.
 


మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అయ్యేందుకు..
‘ప్లాన్‌’ చేయండి..

* remente

పని చిన్నదైనా.. పెద్దదైనా.. అనుకుంటే డెడ్‌లైన్‌లోపే ముగించేయాలి. ఇలా పనిలో మీ సామర్థ్యాన్ని పెంపొదించుకునేందుకు తగినది. రోజులో మీరు పనుల్ని ఎప్పుడు.. ఎలా చేయాలో ప్లాన్‌ చేసుకోవచ్చు. అనుకున్న టైమ్‌కి ఒక్కొక్కటి జాబితాగా పెట్టుకుని టాస్క్‌లను ముగించేందుకు సాయపడుతుంది. రిలేషన్‌షిప్స్‌, ఫిట్‌నెస్‌, పర్సనల్‌ డెవలప్‌మెంట్‌, చదువు.. ఇలా విభాగాలుగా లక్ష్యాలను నిర్దేశించుకొని ఒత్తిడిని అధిగమించొచ్చు. ప్రముఖులు రాసిన వ్యాసాల్ని చదివి స్కిల్స్‌కి సానపెట్టుకోవచ్చు.


ఫిట్‌గా సేవ చేయొచ్చు
* mpact

రోజూ మీ నడక, పరుగు ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. మరికొందరికి సాయంగా మారుతుంది కూడా. అందుకు ప్రత్యేక వేదిక ఇది. ఓ కిలోమీటరు నడిస్తే రూ.10 సహాయార్థులకు అందుతుంది. ఫిట్‌నెస్‌, ఛారిటీని కలగలిపిన యాప్‌. రిజిస్టర్‌ అయ్యాక వ్యాయామంతో ఎలా సాయపడాలో మీరే నిర్ణయించుకోవచ్చు. ఇక రోజూ క్రమం తప్పకుండా వ్యాయామంలో మీరు చిందించే చెమట మరొకరికి సాయంగా మారుతుంది. ఎంత సమయం నడిచారు. ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయో కూడా తెలుసుకోవచ్చు.
 


కుదురు నేర్పాలంటే..
Smiling Mind

విద్యా, ఉద్యోగం, వ్యాపారం.. రంగం ఏదైనా.. వయసు ఎంతైనా.. ఎవరి అవసరానికి తగినట్టుగా వారు ఒత్తిడికి మందు వేయాలనుకుంటే ఈ యాప్‌ని ప్రయత్నించొచ్చు. ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. నిద్రలేమితో ఇబ్బంది పడేవారికి ‘స్లీప్‌’ విభాగంలో ప్రత్యేక సెషన్స్‌ ఉన్నాయి. యాప్‌లో సభ్యులయ్యాక కావాల్సిన సెషన్స్‌ని బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. ఫోన్‌లు, ఇతర గ్యాడ్జెట్‌లకు బానిసలైన వారికి ‘డిజిటల్‌ డిటాక్స్‌’ సెషన్స్‌ ఉపయుక్తం.
 


‘ఎక్స్‌ట్రా’ ఉండాలి..
yousician

రొటీన్‌గా ఎప్పుడూ చేసేవేనా? మనసుకి హాయిగొల్పే సంగీతానికి కాస్త చోటిద్దాం అనుకునేవారికి చక్కని వేదిక. ఇదొక మ్యూజిక్‌ యాప్‌. పియానో ఎలా వాయించాలి? గిటార్‌ ఎలా ప్లే చేయాలి?.. లాంటి మ్యూజిక్‌ పాఠాల్ని దీంట్లో నేర్చుకోవచ్చు. కొత్తగా నేర్చుకుందామనుకునే వారికి సులభంగా అర్థమయ్యేలా వీడియోల రూపంలో పాఠాల్ని నిక్షిప్తం చేశారు. దీంట్లోని ప్రత్యేక టెక్నాలజీతో నేర్చుకున్నది ప్లే చేస్తున్నప్పుడు లైవ్‌లోనే ఫీడ్‌బ్యాక్‌ తెలుసుకోవచ్చు.
 


కృతజ్ఞత చూపేందుకు..
Gratitude: Personal Growth Journal

జీవితం పట్ల మీరెంత కృతజ్ఞతతో ఉన్నారో ఎప్పుడైనా ఆలోచించారా? దాటొచ్చిన మనుషులు, సందర్భాల పట్ల ఎలాగైనా మీ కృతజ్ఞతని చాటే ప్రయత్నం చేశారా? ఈ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని ఇప్పుడు చేయండి. రోజుని సంతోషంగా గడిపేయొచ్చు. గ్రాటిట్యూడ్‌తోనే పాజిటివ్‌ లైఫ్‌ని ప్రారంభించడం సులభం అవుతుంది. యాప్‌ ఒక గ్రాటిట్యూడ్‌ డైరీ లాంటిది అన్నమాట. మీకు నచ్చిన అంశాలు, వ్యక్తులు, కుటుంబం, ఉద్యోగం.. ఇలా దేని గురించైనా రాయొచ్చు. గూగుల్‌ డ్రైవ్‌కి సింక్‌ చేసుకుని గ్రాటిట్యూడ్‌ నోట్స్‌ని భద్రంగా దాచుకోవచ్చు. ఎప్పుడైనా నిరాశ ఎదురైతే ‘హ్యాపీ జర్నల్‌’ని తెరిచి చదువుకోవచ్చు.


 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.