close

తాజా వార్తలు

Published : 11/02/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొసాగుతోంది. 21 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టారు. ఇందుకు అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం తథ్యమైన తాము 55 స్థానాల్లో గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదని భాజపా దిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారి ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో తాము తప్పక విజయం సాధిస్తామని, ఆప్‌ నేత, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ అన్నారు. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి 

2. భారత్‌×న్యూజిలాండ్‌ ఆఖరి వన్డే

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌ బే ఓవల్‌ వేదికగా కొనసాగుతోంది. టాస్‌ గెలిచిన కివీస్‌ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 13 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు మయాంక్‌, పృథ్వీషా, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ కోహ్లీ పెవిలియన్‌ చేరారు. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి 

3. మూడు చట్టాల ముచ్చట్లు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో కలెక్టర్ల సదస్సు జరగనుంది. రాష్ట్రంలో అమలవుతున్న పంచాయతీరాజ్‌, పురపాలక చట్టాలతో పాటు కొత్తగా వస్తున్న రెవెన్యూ చట్టంపైనా సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం, వచ్చే ఖరీఫ్‌ కార్యాచరణ, పౌరులకు ఆరోగ్యసూచికల తయారీ, ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపన తదితర కీలక అంశాలపైనా సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. సెలక్టు కమిటీ దస్త్రం వెనక్కి!

పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై  సెలక్టు కమిటీ ఏర్పాటుకు బ్రేక్‌ పడింది. కమిటీ ఏర్పాటు చేసేందుకు మండలి ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ కార్యాలయం నుంచి పంపిన దస్త్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి (రాష్ట్రంలో శాసనసభ, మండలికి ఒక్కరే కార్యదర్శిగా ఉన్నారు)  సోమవారం తిప్పి పంపినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. రోజుకొకటి రద్దు.. పథకాల కుదింపు

రోజుకొకటి రద్దు.. సంక్షేమ కార్యక్రమాల కుదింపుతో ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసేలా జగన్‌ పాలన సాగుతోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. వ్యక్తి ప్రవర్తనతో సమాజం నిర్వీర్యమవుతుందనేందుకు ఆయనే నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రభుత్వ భూములు అమ్మి అభివృద్ధి చేస్తామనడం అవివేకమని.. సత్తా ఉంటే సంపద సృష్టించేలా అభివృద్ధి సాధించాలని సవాల్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. నేటి నుంచి ఆటో మ్యుటేషన్‌

ఏపీలో భూముల క్రయ, విక్రయాల అనంతరం పేరు మార్పు కోసం ఇక తహశీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు. ఇందుకు వీలుకల్పించే ఆటో మ్యుటేషన్‌ విధానాన్ని మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు.  కొత్త విధానంలో భూములు కొనుగోలు చేసిన వారు మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరంలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ‘ప్యాంట్లు కొంటుంటే మాంద్యం ఇంకెక్కడ?’

దేశంలో మాంద్యం పరిస్థితులు లేవని.. ఒకవేళ ఉంటే కోట్లు, జాకెట్లు ఎలా వేసుకోగలుగుతున్నామని భాజపా ఎంపీ వీరేంద్ర సింగ్‌ మస్త్‌ అన్నారు. యూపీలోని బాలియా నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మాంద్యంపై చర్చ జరుగుతోందే తప్ప దేశంలో  ఆ పరిస్థితులు లేవన్నారు. ఒకవేళ ఉంటే ఇక్కడికి అందరూ ధోతీ, కుర్తాలు వేసుకునేవాళ్లమమని.. కోట్లు, జాకెట్లు వేసుకునేవాళ్ల కాదని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. విందులో ఆహారం వికటించి 290 మందికి అస్వస్థత

విందులో ఆహారం వికటించి వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. యూపీలోని బదాయూ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ గ్రామంలో ఆదివారం జరిగిన విందులో 450 మంది పాల్గొన్నారు. ఆహారం తిన్నాక.. వాంతులు, కడుపునొప్పితో 290 మంది ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది.

9. ట్రంప్‌ భారత పర్యటన ముహూర్తం ఖరారు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనపై శ్వేతసౌధం కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 24-25 తేదీల్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ట్రంప్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆయన సతీమణి, ప్రథమ పౌరురాలు మెలానియాతో కలిసి భారత్‌కు రానున్న ట్రంప్‌.. దిల్లీ, అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారని శ్వేతసౌధం మీడియా సెక్రటరీ స్టెఫానీ గ్రిషమ్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. 1000 దాటిన కరోనా మరణాలు

చైనాలో కరోనా బారిన పడి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరణించిన వారి సంఖ్య 1016కు చేరింది. మరో 42,638 వేల మందికి వైరస్‌ సోకింది. ఒక్క సోమవారం రోజే 108 మంది ప్రాణాలొదిలారు. మరో 2,478 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క హుబెయ్‌ ప్రావిన్సులోనే సోమవారం 103 మంది మృతిచెందారు. ఇక వైరస్ బారి నుంచి బయటపడి 3,996 మంది ఇళ్లకు చేరుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.