close

తాజా వార్తలు

Published : 09/02/2020 09:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. కేజ్రీ హ్యాట్రిక్‌!

దేశ రాజధాని దిల్లీలో సామాన్యుడి చీపురుకట్ట విపక్షాల్ని ఊడ్చేయబోతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ ముక్తకంఠంతో జోస్యం చెప్పాయి. అఖండ విజయంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధికార పీఠాన్ని మరోసారి అలంకరించడం ఖాయమని అంచనా వేశాయి. దిల్లీ అసెంబ్లీకి శనివారం జరిగిన ఎన్నికల్లో 61 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రానికల్లా ఎగ్జిట్‌పోల్స్‌ వెలువడ్డాయి. ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పీఠమెక్కడం లాంఛనమేనని పేర్కొన్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లకు పరిమితమైన భాజపా పరిస్థితి ఈ దఫా కాస్త మెరుగుపడుతుందని తెలిపాయి. కాంగ్రెస్‌ ఖాతా తెరవడం కష్టమేనని అభిప్రాయపడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దేవ భూమిలో హృదయాలయాలు

ప్రకృతి వన్నెలద్దిన ప్రాంతమది. ప్రతి ఒక్కరినీ ఆకర్షించే దేవ భూమి అది. పచ్చటి చెట్ల మధ్య ప్రశాంత జీవనం అక్కడి ప్రజల సొంతం. ఒకరోజు చిటపటలతో మొదలైన వర్షం.. వరదై.. ఏరులై... ఉప్పెనై ముంచెత్తింది. కళ్ల ముందే కలల సౌధాలను కబళించింది. ఊళ్లకు ఊళ్లను మింగేసింది. ఊహించని విధంగా విరుచుకుపడిన ప్రకృతి విపత్తు... ఇల్లూ వాకిలీ, గొడ్డూ గోదా సర్వస్వాన్ని లాగేసుకుని ప్రజలను రోడ్డున పడేసింది. 2018లో కేరళలో సంభవించిన వరదల అనంతర పరిస్థితి ఇది. బాధితులకు అండగా నిలవడానికి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు వేసిన తొలి అడుగును లక్షలాది మంది మానవతామూర్తులు అనుసరించారు. వారి చల్లని హృదయాలు పరచిన బాటలో... అలెప్పీ జిల్లాలో 121 ఇళ్లు రూపుదాల్చాయి. బాధితుల జీవితాల్లో ఆనందాలు నింపనున్నాయి... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆదివారం అనుబంధం ప్రత్యేక కథనం... సాయం మీది... సంతోషం వారిది!  కోసం క్లిక్‌ చేయండి 

3. సార్స్‌ను మించిన కరోనా..!

చైనాని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ రోజురోజుకీ అనేక మంది ప్రాణాల్ని మట్టిలో కలిపేస్తోంది. దాని పీచమణచడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. పరిస్థితి మాత్రం పెద్దగా అదుపులోకి రావడం లేదు. ఓవైపు మరణిస్తున్న వారి సంఖ్య మరోవైపు దీని బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 89 మంది మహమ్మారితో పోరాటం చేస్తూ జీవితాన్ని కోల్పోయారు. వీరిలో 81 మంది వైరస్‌కు కేంద్రంగా ఉన్న హుబెయ్‌ ప్రావిన్సు నుంచే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి సస్పెండ్‌ చేసింది. ఆయన అదనపు డీజీగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంతో వేటు వేసింది. ఈ మేరకు డీజీపీ నుంచి ఈనెల 7న అందిన నివేదిక ఆధారంగా వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని వాటిలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎల్‌ఐసీ..మదుపర్లను మెప్పిస్తుందా..

ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ రూ.10-12 లక్షల కోట్లు ఉండి ఉండొచ్చు. దేశంలోనే అతిపెద్ద నమోదిత కంపెనీగా అవతరించే అవకాశమూ ఉండొచ్చు.రూ.3 లక్షలకు పైగా ఆస్తులను అది నిర్వహిస్తూ ఉండొచ్చు.11 లక్షల ఏజెంట్లు పనిచేస్తూ ఉండొచ్చు.అన్నిటికంటే మించి వచ్చే 14 నెలల్లో ఐపీఓకు వచ్చి మంచి ఆదరణ కూడా పొందొచ్చు. అయితే ఒక విషయంలో మాత్రం అది వెనకడుగు వేసే అవకాశం ఉందని మదుపర్లు అంచనా వేస్తున్నారు. అదేమిటి? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కుర్రాళ్లూ.. కొట్టేయండి..!

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదా.. తిరుగులేని ఆట.. ఈ టోర్నీలో అపజయమెరుగని రికార్డు.. అండర్‌-19 ప్రపంచకప్‌ మరోసారి మనదే అన్న నమ్మకాన్ని కలిగిస్తున్న సానుకూలతలెన్నో! ఇంకొక్క అడుగు చాలు.. కుర్ర జట్టు విశ్వవిజేతగా నిలవడానికి! కప్పుకి, మన కుర్రాళ్లకి మధ్య ఉన్న బంగ్లాదేశ్‌ అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆడుతోంది తొలిసారి. మరి టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు.. ఈ అడ్డంకిని అధిగమించి అయిదో ప్రపంచకప్‌ను అందుకుంటుందా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బ్యాలెట్‌ లేని ఎన్నికలు

రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం సహకార సంఘంలో మాత్రం ఈ సందర్భంగా ఎలాంటి హడావుడి కనిపించలేదు. సంఘంలో మొత్తం 40 మంది ఓటర్లు ఉండటమే ఇందుకు కారణం. సహకార ఎన్నికల చట్టంలోని 22(బి) క్లాజ్‌ ప్రకారం.. 50 మంది కంటే తక్కువ ఓటర్లు ఉన్న సంఘాలకు బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహించరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ సూచన మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహకార అధికారులు శనివారం ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పోలవరం నిర్మాణాన్ని ఆపేయండి

‘‘పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే మాకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపేస్తూ 2018 జులై 10, 2019 జూన్‌ 27 తేదీల్లో జారీచేసిన ఉత్తర్వులపై ఇచ్చిన స్టేను రద్దుచేయండి. మాకు జరిగే నష్టనివారణకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలి’’ అని ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. 71 పేజీల అఫిడవిట్‌ను ఆ రాష్ట్రం సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పడ్డారండీ పరదేశీ ప్రేమలో...

ఎల్లలు లేని ప్రేమలో ఎవరెప్పుడు పడతారో వారికే తెలియదు. అలా కొందరు తారలు ఎల్లలు దాటి విదేశీయుల ప్రేమలో తడిసి ముద్దైపోయారు. వారితో డేటింగులకే పరిమితం కాకుండా పెళ్లి బంధంలో ఒదిగిపోయి విదేశాల్లో కాపురాలు పెట్టారు. ఇంతకీ పరదేశీల ప్రేమలో పడ్డ ఆ దేశీ తారలు ఎవరంటే... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘ఆక్స్‌ఫర్డ్‌’లో అంబారీ..!

ఎవరైనా ‘హాయ్‌ షిమిక్‌’ అని పిలిస్తే ఇదేం కొత్తపేరు అని బిత్తరపోయేరు. అలసిపోయి హోటల్‌కు వెళ్లిన తరవాత కాసింత ‘చిలాక్స్‌’ అవుదాం అని మీ స్నేహితుడు అంటే... అది ‘చిలాక్స్‌’ కాదురా ‘రిలాక్స్‌’ అంటూ తిట్టిపోసేరు. ఎందుకంటే... అవన్నీ... 2019లో ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ గుర్తించిన కొత్త పదాలు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.