close

తాజా వార్తలు

Published : 08/02/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోహ్లీ

భారత్×న్యూజిలాండ్‌ మధ్య మరో ఆసక్తికర పోరు జరుగుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌ వేదికగా కివీస్‌తో కోహ్లీసేన రెండో మ్యాచ్‌ ఆడుతోంది. టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌.. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక వికెట్ నష్టపోయి 108 పరుగులు చేసింది. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి 

2. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 2.99 కోట్లు

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొత్త ఓటర్ల జాబితాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ శుక్రవారం విడుదల చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2.99 కోట్లకు పైగా ఉంది. గత నెలలో ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకున్న వారి సంఖ్య 1,44,855. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 34707 పోలింగు కేంద్రాలున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. 18.72 లక్షల కార్డుల కోత

ఏపీలో రేషన్‌ కార్డుల వడపోత పూర్తయింది. రాష్ట్రంలో కొత్తగా ఇవ్వబోతున్న బియ్యం కార్డులకు అర్హుల ఎంపిక కొలిక్కివచ్చింది. ఒకటీ రెండూ కాదు ప్రస్తుతం తెల్లకార్డులున్న వారిలో ఏకంగా 18.72 లక్షల కుటుంబాలను అనర్హులుగా ప్రభుత్వం తేల్చింది. ఒక్కో కుటుంబానికి సగటున ముగ్గురు సభ్యుల చొప్పున చూసినా.. సుమారు 55.50 లక్షల మందికి నెల నెలా బియ్యం, ఇతర సరకుల పంపిణీ నిలిచిపోనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. కొత్తగా 10 పుర, నగర పంచాయతీలు

ఏపీ రాష్ట్రంలో కొత్తగా రెండు పురపాలక సంఘాలు, ఎనిమిది నగర పంచాయతీలు ఏర్పాటయ్యాయి. పురపాలక సంఘాల ఏర్పాటుకు 40కిపైగా ఉన్న ప్రతిపాదనల్లో ముఖ్యమైనవిగా భావించిన పదింటిని ప్రభుత్వం ఆమోదించిందని తెలుస్తోంది. వీటితో రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల సంఖ్య 110 నుంచి 120కి పెరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. వరంగల్‌లో మైండ్‌ ట్రీ ఐటీ కేంద్రం

ప్రముఖ పారిశ్రామిక, నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ.. తమ అనుబంధ సంస్థ మైండ్‌ ట్రీ ఐటీ కేంద్రాన్ని వరంగల్‌ నగరంలో ఏర్పాటు చేయనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ట్విటర్‌లో తెలిపారు. హైదరాబాద్‌ మెట్రోరైలు మూడో కారిడార్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు ఎల్‌ అండ్‌ టీ సీఈవో, ఎండీ సుబ్రమణ్యన్‌.. వరంగల్‌లో మైండ్‌ ట్రీ కేంద్రం ఏర్పాటుకు అంగీకారం తెలిపారని ఆయన వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. నిరీక్షణలో ఉంటే జీతం హుళక్కే

పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పలువురు అధికారులకు నెలల తరబడి పోస్టింగులు ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా వారికి మరింత షాక్‌ ఇచ్చింది. ఏ ఉద్యోగైనా సరే మూడు నెలలకు మించి నిరీక్షణ(వెయిటింగ్‌)లో ఉంటే... ఆ మొత్తం కాలాన్ని అసాధారణ సెలవుగా పరిగణిస్తామని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ఫలితంగా ఎవరైనా సరే మూడు నెలలు దాటి అధికంగా ఒక్క రోజు నిరీక్షణ (వెయిటింగ్‌)లో ఉన్నా సరే ఆ మొత్తం కాలవ్యవధికి సంబంధించిన వేతనం అందదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. బ్యాంకుల్లాగే తపాలా బాదుడు

తపాలా శాఖ బాదుడికి సిద్ధమైంది. బ్యాంకుల్లో మాదిరి కనీస మొత్తం పొదుపు ఖాతాలో లేకుంటే.. రూ.100 అపరాధ రుసుం వేయనుంది. కనీసం రూ.500 పొదుపు ఖాతాలో నిల్వ ఉండాలని నిర్దేశించింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది.

8. ప్రధాని ప్రసంగం నుంచి పదం తొలగింపు

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ప్రధాన ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌లు రాజ్యసభలో చేసిన ప్రసంగాల్లో ఒక్కో పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తూ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఉత్తర్వులు జారీచేశారు. జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) గురించి ప్రస్తావిస్తూ ప్రధాని చేసిన వ్యాఖ్య నుంచి ఒక పదాన్ని, ఆజాద్‌ మాటల నుంచి మరో పదాన్ని రికార్డుల నుంచి తొలగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. అనిల్‌ రూ.700 కోట్లు చెల్లించాల్సిందే: బ్రిటన్‌ కోర్టు

రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ 3 చైనా బ్యాంకులకు 6 వారాల్లోగా 100 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.700 కోట్లు) చెల్లించాల్సిందేనని బ్రిటన్‌కోర్టు తీర్పు ఇచ్చింది. రుణ ఒప్పందం కింద అనిల్‌ నుంచి 680 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.4800 కోట్ల) రికవరీ చేయాలని కోరుతూ చైనా బ్యాంకులు వేసిన దావాను విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అంబానీ నికరవిలువ సున్నాగా మారిందన్న ఆయన తరఫు న్యాయవాదుల వాదనను కోర్టు అంగీకరించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ద.కొరియాలో భారీగా సామూహిక వివాహాలు

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.