close

తాజా వార్తలు

Published : 04/02/2020 09:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. పైసల బండి పల్టీ

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా మారుతోంది. ఆదాయం, వ్యయం ఏ రకంగా చూసినా అయిదేళ్లతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం అన్నింటా నేలచూపులే. 2015-16 నుంచి 2018-19 వరకు ఆదాయాలు, ఖర్చుల్లో పురోగతి కనిపించగా.. ఈసారి హఠాత్తుగా దిగజారింది. పన్నులు, కేంద్ర పన్నుల్లో వాటాలు, ఇతరత్రా సెస్‌లు తదితర ఆదాయాలు కలిపి లెక్కించే రెవెన్యూ వసూళ్ల కింద తొమ్మిది నెలల్లో సాధించింది కేవలం రూ72,322.49 కోట్లు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. కలెక్టర్లకు కొత్త కార్యాచరణ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 11న ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. కొత్త రెవెన్యూ చట్టం, పట్టణ ప్రగతి ప్రధాన ఎజెండాగా సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలకమైన అంశాలను వారితో చర్చించనున్నారు. అవినీతికి ఆస్కారం లేని.. ప్రజలకు, రైతులకు పారదర్శకమైన కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన సీఎం క్షేత్రస్థాయిలో భూపరిపాలనలో ప్రత్యక్ష సంబంధం కలిగిన కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఏపీకి హోదా లేదు.. సాయమే

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అయిదేళ్ల పాటు ప్రత్యేకహోదా కల్పిస్తామని నాటి ప్రధానమంత్రి ప్రకటించిన మాట వాస్తవమేనని, అయితే 14వ ఆర్థికసంఘం సిఫార్సుల నేపథ్యంలో హోదా రద్దయిపోయినట్లేనని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకుర్‌ తెలిపారు. 2015 డిసెంబరు 1న నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు ఇచ్చిన నివేదిక, కొత్త రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సాయం ప్రకటించామన్నారు. సోమవారం లోక్‌సభలో విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. రేపటి నుంచే మన కుంభమేళా

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. వేల సంఖ్యలో గుడారాలు, దుకాణాలతో ఈ ప్రాంతం మహా నగరాన్ని తలపిస్తోంది. అసలైన జాతర బుధవారం నుంచి నాలుగు రోజులపాటు జరగనుండగా.. నెల రోజుల నుంచే భక్తులు లక్షల సంఖ్యలో వన దేవతలను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ఇప్పటికే 40 లక్షల మంది అమ్మలను దర్శించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. యాప్‌తో జనగణన!

జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌)లో నమోదు చేసే వివరాలు బయటికి పొక్కుతాయనే ఆందోళనల నేపథ్యంలో ఈ ప్రక్రియలో కేంద్రం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. సాధారణంగా ఎన్‌పీఆర్‌ దరఖాస్తును ప్రజల ఇళ్లకు తీసుకెళ్లి వివరాలు నింపుతారు. ఈ సారి గణకులు ప్రత్యేక యాప్‌లో సైతం వివరాలు నమోదు చేసే అవకాశం కల్పించబోతున్నారు. దరఖాస్తు లేదా యాప్‌లో ఏదో ఒకదాంట్లో ఒక కుటుంబం ఎన్‌పీఆర్‌ వివరాలు పూర్తిచేస్తే సరిపోతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. రాజకీయ కుట్రతోనే ఆందోళనలు

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండటం యాదృచ్ఛికం కాదని... ఇది జాతి ఐక్యమత్యాన్ని దెబ్బతీసే కుట్రపూరిత రాజకీయ ప్రయోగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వీటి వెనుక ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌), కాంగ్రెస్‌లు ఉన్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలే లక్ష్యంగా ఆయన విరుచుకుపడ్డారు. కర్‌కర్‌డూమాలో సోమవారం ఆయన భాజపా ఎన్నికల సభలో ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఆదాయపు పన్ను రిటర్నులు సులభం

బడ్జెట్లో ప్రతిపాదించిన ఆదాయపు పన్ను కొత్త రేట్ల వల్ల ఎవరికీ నష్టం ఉండదని, 30-40 శాతం మందికి  ప్రయోజనం కలుగుతుందని రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే అన్నారు. ఎవరైతే డిడక్షన్‌లు, మినహాయింపుల కోసమే పెట్టుబడి పథకాలు తీసుకోవాలని అనుకోరో.. వాళ్ల చేతిలో మరింత డబ్బులు మిగులుతాయని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. చైనాలో మరో 64 మంది బలి

చైనాలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకీ మరణిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తొలుత రోజుకి 10 నుంచి 20కి పరిమితమైన మరణాలు ఇప్పుడు ఏకంగా 50 దాటిపోతోంది. ఆదివారం 57 మంది ప్రాణాలొదలగా.. సోమవారం ఏకంగా 64 మంది మృత్యువాతపడ్డారు. దీంతో చైనాలో ఇప్పటి వరకు ఈ వైరస్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 425కి చేరింది. ఇక ఈ వైరస్‌ సోకిన వారి సంఖ్య 20,438కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. దాయాదితో ఢీ

అయిదోసారి అండర్‌-19 ప్రపంచకప్‌ అందుకోవాలనే పట్టుదలతో ఉన్న యువ భారత్‌.. కీలక సమరానికి సిద్ధమైంది. మంగళవారం సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. వరుసగా మూడో సారి ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరాలంటే పాక్‌ గండాన్ని భారత్‌ దాటాల్సిందే. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగిన భారతే ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌ అనడంలో సందేహం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. అట్టహాసంగా బాఫ్టా అవార్డు వేడుక


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.