close

తాజా వార్తలు

Published : 02/02/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. కేటాయింపుల్లో కొత్త పంథా

పౌరులందరికీ సుఖమయ జీవితం, సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం 2020-21 ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇందుకోసం కేటాయింపుల్లో నూతన పంథాను అనుసరించడంతో పాటు, దీర్ఘకాలిక ప్రభావం ఉన్న సంస్కరణలను చేపట్టారు. వివిధ పథకాల కింద వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి అధిక శాతం నిధులు కేటాయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై సీతకన్ను

ఆంధ్రప్రదేశ్‌ను 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు దెబ్బకొట్టాయి. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటాను 4.305% నుంచి 4.111%కి తగ్గించడం వల్ల రాష్ట్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1500 కోట్లకు పైగా నష్టపోనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటాగా 2020-21లో రూ.32,237.68 కోట్లకు పెరగనుంది. రాష్ట్రాల వాటాలను లెక్కించడానికి 15వ ఆర్థిక సంఘం తీసుకున్న కొత్త కొలమానాల కారణంగా ఏపీ వాటా 4.111%కి తగ్గిపోయింది. ఫలితంగా రూ.1,521 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. తెలంగాణకి కేంద్రం మొండి చెయ్యి

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపింది. పన్నులవాటా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా అందే నిధులు మినహా రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌ నుంచి ఎలాంటి సహకారం లేకుండా పోయింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి పన్నుల వాటా 2.13 శాతంగా నిర్ధారించి రూ.16,726.58 కోట్లుగా ప్రతిపాదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. దక్షిణాదికి గట్టి దెబ్బ

ఊహించినట్లుగానే జరిగింది. కేంద్ర పన్నుల్లో వాటా పంపిణీకి 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని తొలి నుంచి అనుమానించినట్లుగానే కోత పడింది. కొత్త కొలమానాల వల్ల 8 రాష్ట్రాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 18,389 కోట్లు నష్టపోతుండగా, అందులో నాలుగు దక్షిణాది రాష్ట్రాల వాటానే రూ.16,640.29 కోట్లు. కొత్త విధానంతో కర్ణాటక అత్యధికంగా రూ.8,367.21 కోట్లు కోల్పోతోంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నవి కేరళ (రూ.4,367.88కోట్లు), తెలంగాణ (రూ.2,383.90కోట్లు). దక్షిణాదిలో తమిళనాడు ఒక్కటే లబ్ధిపొందిన రాష్ట్రం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ప్రత్యేక హోదాపై కేంద్రానిదే నిర్ణయం

రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే అంశంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తన మధ్యంతర నివేదికలో వెల్లడించింది. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ పలు రాష్ట్రాలు విన్నవించాయని, వాటిని పరిగణనలోకి తీసుకుని కేంద్రమే తగిన నిర్ణయం తీసుకుంటుందని వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. నేడు శాంతివనానికి రాష్ట్రపతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ పంచాయతీ శాంతివనంలో రామచంద్ర మిషన్‌ నిర్వహిస్తున్న 75వ వసంతోత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం హాజరుకానున్నారు. ఇందుకోసం దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కోవింద్‌ కుటుంబ సమేతంగా శనివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10.20కి శాంతివనాన్ని (ధ్యాన కేంద్రం) కోవింద్‌ సందర్శిస్తారు. ఆ తర్వాత దిల్లీకి బయల్దేరి వెళ్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. అర్హులు ఆందోళన చెందవద్దు

వైఎస్సార్‌ పింఛను కానుక పథకానికి ఎవరెవరు అర్హులో గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించామని, వాటికి అనుగుణంగా దరఖాస్తు చేసుకుంటే.. 5 రోజుల్లో అధికారులు పరిశీలించి వెంటనే మంజూరు చేస్తారని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎలాంటి సమస్య ఉన్నా గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. మేడారం జాతరకు 20 ప్రత్యేక రైళ్లు

మేడారం మహాజాతరకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. సికింద్రాబాద్‌-వరంగల్‌-హైదరాబాద్‌ల మధ్య 10 రైలు సర్వీసులు, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-వరంగల్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ల మధ్య మరో 10 రైలు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఫిబ్రవరి 4-8 తేదీల మధ్య ఈ రైళ్లు ఆయా రూట్లలో రాకపోకలు సాగిస్తాయి. ఈ రైళ్లన్నీ జనరల్‌ బోగీలతో నడుస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. మిడతలపై పోరుకు పాక్‌లో ఆత్యయిక పరిస్థితి

మిడతల సమస్యపై పోరుకు పాకిస్థాన్‌ ప్రభుత్వం జాతీయ ఆత్యయిక పరిస్థితిని ప్రకటించింది. ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలో శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమస్య నుంచి అన్నదాతలను బయట పడేయడానికి ఉద్దేశించిన జాతీయ సత్వర ప్రణాళిక(ఎన్‌ఏపీ)కు రూ.730 కోట్లు కేటాయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. సున్నా చుట్టేస్తారా!

మొదట రెండు సాధికార విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసం.. ఆపై చేజారే మ్యాచ్‌లను సూపర్‌ ఓవర్లో గెలిచిన ఉత్సాహం.. టీమ్‌ఇండియా ఇప్పుడు మామూలు ఊపులో లేదు. ఈ జోరులో ఆదివారం చివరి టీ20లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై వైట్‌వాష్‌కు గురైతే అంతకంటే పరాభవం ఉండదు కాబట్టి.. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయాన్ని అడ్డుకోవడానికి కివీస్‌ ఆటగాళ్లు గట్టిగానే ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.