close

తాజా వార్తలు

Published : 01/02/2020 18:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘డిజిటల్‌’కు ఊతమిచ్చేలా నూతన ఆర్థిక వ్యవస్థ

ప్రపంచ దేశాలకు దీటుగా భారత్‌ను సాంకేతికంగా మరో మెట్టు ఎక్కించే విధంగా త్వరలోనే ఓ కొత్త ఆర్థిక వ్యవస్థను తీసుకురానున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. డిజిటలైజేషన్‌లో భాగంగా ప్రైవేటు రంగంలో సాంకేతికంగా తీసుకురావాల్సిన మార్పులు.. వాటికి కల్పించాల్సిన వసతులపై సీతారామన్‌ ప్రసంగించారు. దీనిలోని అంశాలు ఇలా ఉన్నాయి...

* ప్రైవేటు రంగానికి ఊతమిస్తూ దేశవ్యాప్తంగా డేటా సెంటర్‌ పార్కుల ఏర్పాటుకు త్వరలో నూతన ఆర్థిక వ్యవస్థ.

* భారత్‌నెట్‌ ప్రాజెక్టులో భాగంగా ‘ఫైబర్‌ టు హోం’(ఎఫ్‌టీటీహెచ్‌) కనెక్షన్స్‌ ద్వారా ఈ ఏడాది లక్ష గ్రామ పంచాయతీల అనుసంధానం. దీనికి గాను ఈ (2020-21) ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్ల కేటాయింపు.

* డిజిటల్‌ ప్లాట్‌ఫాం విస్తరణలో భాగంగా అంకుర సంస్థల ఏర్పాటు, పలురకాల సాంకేతిక విభాగాల్లో దేశవ్యాప్తంగా నాలెడ్జ్‌ ట్రాన్స్‌లేషన్‌ క్లస్టర్స్‌ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతిపాదనలు.

* టెక్నాలజీ క్లస్టర్స్‌ వృద్ధికి ఊతమిచ్చేలా సదుపాయాలు, తయారీ రంగంలో చిన్న తరహా పరిశ్రమలకు మౌలిక వసతుల కల్పనకు సరికొత్త ఆర్థిక వ్యవస్థ.

* రానున్న ఐదేళ్ల కాలంలో నేషనల్‌ మిషన్‌ ఆన్‌ క్వాంటమ్‌ టెక్నాలజీస్‌ అండ్ అప్లికేషన్స్‌పై రూ.8 వేల కోట్ల కేటాయింపులు చేసే విధంగా ప్రతిపాదనలు.
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.