close

తాజా వార్తలు

Updated : 01/02/2020 09:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. నేడే కేంద్ర వార్షిక ఆదాయ వ్యయ పద్దు

2020-21 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ప్రవేశపెట్టనున్నారు. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదికనూ సమర్పిస్తారు. అందరికీ నచ్చేలా ఉండొచ్చని భావిస్తున్న బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను తగ్గింపు.. సామాజిక రంగాలకు వరాలు.. మౌలిక వసతులకు భారీ పెట్టుబడులు.. వంటివాటిపై ఆశలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. దిల్లీకి చేరిన వుహాన్‌లోని భారతీయులు

కరోనా వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న హుబి ప్రావిన్సులో ఉన్న భారతీయులు శనివారం ఉదయం 7:30 గంటలకు దిల్లీకి చేరుకున్నారు. ప్రావిన్సు మొత్తంలో 600 మందికిపైగా భారతీయులు ఉండగా.. వారిలో 400 మంది స్వదేశానికి వస్తామని అభ్యర్థించడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టింది. వీరిలో ప్రస్తుతం 324 మంది భారత్‌కు చేరుకున్నారు. నేడు వచ్చిన విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 58 మంది ఇంజినీర్లు దిల్లీకి చేరుకున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. విజిలెన్స్‌ కమిషనర్‌ ఆఫీసు కర్నూలుకు

ఏపీ విజిలెన్స్‌ కమిషనర్‌ కార్యాలయం, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడిలోని సచివాలయం నుంచి పనిచేస్తున్నాయి. పరిపాలన కారణాల రీత్యా వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. నేటి నుంచి కొత్త పింఛన్ల పంపిణీ

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద కొత్త పింఛన్ల పంపిణీని శనివారం ప్రారంభించనున్నారు. అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు, తలసేమియా, సికెల్‌సెల్‌ ఎనీమియా, తీవ్ర హీమోఫీలియా, తీవ్రబోదకాలు, పక్షవాతం తదితర వ్యాధులతో బాధపడేవారికి కొత్తగా ప్రభుత్వం పింఛన్లు అందించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. గాంధీకి చేరిన కరోనా కిట్లు

కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను హైదరాబాద్‌లోనే నిర్వహించడానికి మార్గం సుగమమైంది. శుక్రవారం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి నిర్ధారణ కిట్లను కేంద్ర ప్రభుత్వం పంపించింది. ప్రస్తుతం గాంధీలో చేరిన అనుమానితుడి నమూనాలను పుణెకు పంపించారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో గాంధీ ఆసుపత్రిలోనే కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ధరణి ఆశలు ఆవిరి

రాజధాని అమరావతి చుట్టూ 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధి చిన్నాభిన్నమైంది. రూ.వేల కోట్ల సంపద ఆవిరయింది. బాహ్యవలయ రహదారికి సమీపంలో, ఆవల ఉన్న వ్యవసాయ భూముల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రాజధానుల గురించి డిసెంబరు17న ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీలో ప్రస్తావించేవరకు ఎకరా రూ.30లక్షలు పలికిన భూములు ఇప్పుడు రూ.15లక్షలు, రూ.10లక్షలకు తగ్గిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ‘భీమిలిలో భూచోళ్లు’పై సీఎం ఆరా

విశాఖ జిల్లా భీమిలిలో దేవాదాయశాఖ పరిధిలో ఉన్న లంగర్‌ చౌల్ట్రీకి చెందిన భూమికి కొందరు చౌకగా లైసెన్స్‌ పొందాలనుకున్న తీరుపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఈ అంశంపై నివేదిక ఇవ్వాలంటూ సీఎం కార్యాలయం, దేవాదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు  ఓ నివేదికను సీఎం కార్యాలయానికి అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. రైలు బండి ప్రైవేట్‌ కూత!

ఒకదాని తర్వాత ఒకటిగా సేవలన్నీ ప్రైవేటీకరిస్తూ పోతున్న రైల్వే ఇప్పుడు రైళ్లనూ ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ దిశగా ఇప్పటికే వంద మార్గాలను గుర్తించి జాబితాను తయారు చేసింది. ఈ మార్గాల్లో మొత్తం 150 ప్రైవేట్‌ రైళ్లు రానున్నాయి. బడ్జెట్‌లో ఈ ప్రక్రియకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో నడిచే పలు రైళ్లతో పాటు.. నగరం మీదుగా ప్రయాణించేవి ఇందులో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఈ నలుగురు నిర్వహిస్తున్న కంపెనీల విలువ.. మన స్టాక్‌మార్కెట్ల కంటే ఎక్కువ!

భారత టెక్‌ నిపుణులు సీఈఓలుగా వ్యవహరిస్తున్న కంపెనీల జాబితాలో తాజాగా ఐబీఎం వచ్చి చేరింది. ఆసక్తికర విషయం ఏమింటంటే... యూఎస్‌లో అధిక మార్కెట్‌ విలువ (మార్కెట్‌ కేపిటలైజేషన్‌) గల కంపెనీలకు భారత నిపుణులే సారధ్యం వహించటం. 2018లో మన స్టాక్‌మార్కెట్లు నమోదు చేసిన గరిష్ఠ మార్కెట్‌ విలువ 2.45 ట్రిలియన్‌ డాలర్లు. కానీ ఈ నాలుగు కంపెనీలు...మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అడోబ్‌, ఐబీఎం- మార్కెట్‌ విలువ దీనికంటే అధికంగా 2.6 ట్రిలియన్‌ డాలర్లు ఉండటం ప్రత్యేకత. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ‘నవశకానికి బ్రెగ్జిట్‌ నాంది’

ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్‌ నిష్క్రమించడం నవశకానికి నాంది అని ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వ్యాఖ్యానించారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి  అధికారికంగా ఈయూ నుంచి బ్రిటన్‌ వేరుపడింది. అంతకుముందు ప్రధాని వీడియో సందేశమిచ్చారు. బ్రెగ్జిట్‌ను బ్రిటన్‌-భారత్‌ వ్యాపార వర్గాలు స్వాగతించాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.