close

తాజా వార్తలు

Published : 27/01/2020 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సుఖోయ్‌- 30నిమోహరించిందెక్కడ?

పోటీపరీక్షల కోసం... వర్తమాన అంశాలు

జాతీయం

పోటీ పరీక్షల్లో వర్తమానాంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వీటిని విద్యార్థులూ, ఉద్యోగార్థులూ ఎప్పటికప్పుడు గమనిస్తూ గుర్తుంచుకోవడం ఎంతో అవసరం!

1. కేంద్ర బడ్జెట్‌ ప్రతుల ముద్రణకు ముందు సంప్రదాయపరంగా నిర్వహించే హల్వా వేడుకను ఢిల్లీలోని ఆర్థికశాఖ కార్యాలయంలో ఏ రోజున నిర్వహించారు?

(ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌లు ఈ వేడుకను ప్రారంభించారు. తద్వారా 2020- 21 బడ్జెట్‌ ప్రతుల ముద్రణకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటలో ప్రవేశపెడతారు. బడ్జెట్‌కు తుది రూపు వచ్చిన తర్వాత, ముద్రణకు పంపే ముందు హల్వా వేడుక చేయడం సంప్రదాయంగా వస్తోంది)

1) 2020 జనవరి 20 2) 2020 జనవరి 21 3) 2020 జనవరి 22 4) 2020 జనవరి 23

2. అగ్రశ్రేణి యుద్ధ విమానం సుఖోయ్‌- 30 ఎంకేఐను వైమానిక దళం తొలిసారిగా దక్షిణ భారతదేశంలోని ఏ ప్రాంతంలో మోహరించింది?

(వ్యూహాత్మకంగా కీలకమైన హిందూ మహాసముద్ర ప్రాంత- ఐవోఆర్‌ పరిరక్షణకు వైమానిక దళం ఈ చర్యను చేపట్టింది. మొత్తం ఒక స్క్వాడ్రన్‌ను ఇక్కడ మోహరించింది. ఈ యుద్ధ విమానాలకు బ్రహ్మాస్‌ క్రూయిజ్‌ క్షిపణులను అమర్చారు)

1) తంజావూరు 2) విశాఖపట్టణం 3) ముంబయి 4) పనాజి

3. భారతీయ నౌకాదళం కోసం ఎంత మొత్తంలో ఆరు సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించాలని రక్షణశాఖ నిర్ణయించింది?

(ఇందుకోసం భారత్‌కు చెందిన 2 నౌకా నిర్మాణసంస్థలను, 5 విదేశీ ఆయుధ తయారీ దిగ్గజాలను ఎంపిక చేసింది. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ పథకంలో భాగంగా భారత్‌కు చెందిన ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌, మజగావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌ సంస్థలు ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్నాయి. ఈ ప్రాజెక్టును ‘పీ 75ఐ’గా పిలుస్తున్నారు. రూ. 5,100 కోట్లతో దేశీయంగా సైనిక సామగ్రిని సమకూర్చుకోవడానికి కూడా రక్షణశాఖ ఆమోదం తెలిపింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఆధునికీకరించిన సారంగ్‌ శతఘ్నులను మార్చి 31 నాటికి సైన్యంలో ప్రవేశపెట్టాలని కూడా రక్షణశాఖ నిర్ణయించింది)

1) రూ. 25 వేల కోట్లు 2) రూ. 50వేల కోట్లు 3) రూ. 75 వేల కోట్లు 4) రూ. లక్ష కోట్లు

4. పాఠశాల విద్యార్థులు ‘రాజ్యాంగ ప్రవేశిక’ను ప్రతిరోజూ పఠించడం తప్పనిసరి చేస్తూ ఏ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది?

(జనవరి 26న గణతంత్ర దినోత్సవం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిరోజూ ఉదయం పాఠశాల ప్రారంభానికి ముందు జరిగే ప్రార్థనలో విద్యార్థులు తప్పనిసరిగా ‘రాజ్యాంగ ప్రవేశిక’ను చదవాలని ప్రభుత్వం ప్రకటించింది)

1)గుజరాత్‌ 2)ఉత్తరప్రదేశ్‌ 3)మహారాష్ట్ర 4)మధ్యప్రదేశ్‌

5. వినూత్న ఆవిష్కరణలు, సామాజిక సేవా కార్యక్రమాలు, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో అద్భుత ప్రతిభ చూపిన చిన్నారులకు, పలు సందర్భాల్లో చూపిన అసమాన సాహసానికి గుర్తింపుగా 5- 18 ఏళ్ళ పిల్లలకు ఇచ్చే ‘‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల’ను 2020 కి గాను వివిధ కేటగిరీల్లో మొత్తం ఎంతమందికి ప్రకటించారు?

(ఈ పురస్కారం కింద రూ. లక్ష నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేస్తారు)

1) 29 2) 39 3) 49 4) 59

జవాబులు: 1)1 2)1 3)2 4)3 5)3

- సీహెచ్‌. కృష్ణప్రసాద్‌

మిగతా వర్తమాన అంశాలను www.eenadupratibha.net లో చూడండి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.