close

తాజా వార్తలు

Published : 26/01/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించింది. శనివారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత  ఖమ్మం, సూర్యాపేట, కృష్ణా జిల్లాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బస్వాపురం, పాతర్లపాడు గ్రామాలలో, సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో, కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలోని వివిధ గ్రామాల్లో  3 నుంచి 6 సెకన్ల పాటు భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని స్థానికులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. గణ భారత దీప్తి

కాల చక్రం గిర్రున తిరిగింది. భారత్‌ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి 70 వసంతాలు పూర్తయ్యాయి. సుస్థిర పాలనతో, సమున్నత విలువలతో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతూనే ఉంది. నాడు ఎగతాళి చేసిన వాళ్ల వారసులంతా ఆశ్చర్యంతో నోళ్లు వెల్లబెట్టుకొని చూసేలా చేస్తోంది. దేశంలో ఒడుదొడుకులు ఎదురయినప్పుడల్లా మన ప్రజాస్వామ్య వ్యవస్థ మరమ్మతు చేసుకుంటూ ప్రగతి పథంలో పయనిస్తోంది. ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి 

3. పురపోరు.. తెరాస జోరు

తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో విజయం సాధించిన అధికార తెరాస పురపాలిక ఎన్నికల్లోనూ సత్తాచాటింది. తెరాస కారు పరుగులకు కొన్ని చోట్ల విపక్షాలు గల్లంతయ్యాయి. కొన్ని చోట్ల తిరుగుబాటుదారులతో అధికార పార్టీకి సమస్యలు తప్పలేదు. ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలకు గానూ 104 స్థానాలను తెరాస దక్కించుకోగా, కాంగ్రెస్‌ ఎనిమిది, భాజపా 3, ఎంఐఎం 2, ఫార్వర్డ్‌ బ్లాక్‌ 2 చోట్ల స్థానాలు దక్కించుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. గ్రామ సచివాలయాల్లో 470 సేవలు

ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో 470 పౌర సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,002 సచివాలయాల్లో ప్రజలు నేటి నుంచి ఈ సేవలను ఉపయోగించుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఏయే సేవలను ఎన్ని గంటల్లో, రోజుల్లో అందించాలన్న విషయంపైనా సేవా పట్టికను సిద్ధం చేశారు. అత్యధిక సేవలు 72 గంటల్లో అందేలా కార్యాచరణ రూపొందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఎమ్మెల్సీలను చేజారనీయొద్దు

ఏపీ శాసనమండలి రద్దుకు సోమవారం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు అధికార పక్షం సంకేతాలిస్తుండటంతో తమ ఎమ్మెల్సీలెవరూ జారిపోకుండా తెదేపా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టి లాక్కునేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తున్నట్టు తెలియడంతో.. ఎవరూ అటువైపు మొగ్గుచూపకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పార్టీ అధినేత చంద్రబాబు శుక్ర, శనివారాల్లో పార్టీ ఎమ్మెల్సీలతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి, వారికి పార్టీ అండగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిందేమీ లేదని ధైర్యం చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ఇక ప్రభుత్వ రవాణా ఆర్టీసీ కార్గోలోనే!

సర్కారు శాఖలన్నీ ఇకపై సరకు రవాణా వ్యవహారాలను అనివార్యంగా తెలంగాణ ఆర్టీసీ కార్గో ద్వారానే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత ఉత్తర్వులు వారంలోగా జారీ అయ్యే అవకాశం ఉంది. త్వరలో కార్గో సేవలను ప్రారంభించేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. దశలవారీగా వీటిని 822 బస్సుల ద్వారా నిర్వహించనుంది. ఇందుకోసం తొలిదశలో 52 బస్సులను సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి అనుమతి లభిస్తే సోమవారం కార్గో సేవలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఇక్కడే పుట్టాం..ఇక్కడే చస్తాం

‘‘ఇక్కడే పుట్టాం.ఇక్కడే చస్తాం. చచ్చేవరకు మేము భారతీయులమే. మేమెందుకు ధ్రువీకరణ పత్రాలు చూపించాలో ముందు చెప్పాలి’’ అని అఖిల భారత ముస్లిం నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం రాత్రి ఎంఐఎం ఆధ్వర్యంలో పాతబస్తీ ఖిల్వత్‌ మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మతం ఆధారంగా..జీవించే హక్కును హరించవద్దంటూ నేతలు గళమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ‘మూడు రాజధానులు’ చెడ్డ నిర్ణయం

మూడు రాజధానుల నిర్ణయం చెడ్డ ఆలోచనని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతున్న అన్ని ప్రాంతాల అభివృద్ధికి అది ఏమాత్రం తోడ్పడే అంశం కాదని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. అది పూర్తిగా రాజకీయ నిర్ణయంగానే కనిపిస్తోందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది ఆర్థికంగానూ భారమేనన్నారు. రాజ్యసభ టీవీలో ప్రసారమయ్యే ‘ద బిగ్‌ పిక్చర్‌’ కార్యక్రమంలో ఈనెల 21న ‘‘ఆంధ్రప్రదేశ్‌లో బహుళ రాజధానులు, పాలన వికేంద్రీకరణ’ అంశంపై చర్చ జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కరోనాపై పోరులో గెలుస్తాం

ఊహించని ఉత్పాతంలా విరుచుకుపడిన కొత్తరకం కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర పరిస్థితులు నెలకొన్నా, దానిపై పోరులో విజయం సాధిస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదిక 10 రోజుల్లో నిర్మించబోతున్న 1000 పడకల ఆస్పత్రికి అదనంగా 1300 పడకల సామర్థ్యంతో మరో ఆస్పత్రిని వుహాన్‌లో 15 రోజుల్లో నిర్మించబోతున్నట్లు చైనా ప్రకటించింది. ఇప్పటివరకు 1287 మందికి వైరస్‌ సోకగా వారిలో 237 మంది పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. నేడు రెండో టీ20

ఒక్క రోజు విరామంలో మరో పరుగుల పండుగ సిద్ధమైంది. న్యూజిలాండ్‌ పర్యటనలో భారత్‌కు అదిరే ఆరంభాన్నిచ్చిన ఈడెన్‌ పార్క్‌ మైదానం వరుసగా రెండో మ్యాచ్‌కూ ఆతిథ్యమివ్వబోతోంది. తొలి టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో నెగ్గిన ఈ మైదానంలోనే ఆదివారం రెండో టీ20 జరగనుంది. పర్యటనను ఘనవిజయంతో ఆరంభించిన కోహ్లీసేన, అదే ఊపులో మరో విజయం సాధించాలని చూస్తుంటే.. సొంతగడ్డపై తమకు షాకిచ్చిన భారత్‌కు బదులు ఇవ్వాలన్న కసితో కివీస్‌ ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.