close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120010836 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => hXf_txS_AZA [video_short_link] => hXf_txS_AZA [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-01-23 14:11:09.636423 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 23/01/2020 14:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇది ప్రజాపోరాటం..ఎప్పటికీ ఆగదు:చంద్రబాబు

అమరావతి: రాజధాని కోసం పోరాటం ఆగదని తెదేపా అధినేత చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. రాయలసీమకు ఎవరు ఏమి చేశారో, ఒక్కసారి చరిత్ర చూసుకోవాలని వైకాపా నేతలకు సూచించారు. కష్టపడి రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తే.. వాటిని వెనక్కి పంపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్‌ సంస్థపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని, ధైర్యముంటే నిరూపించాలని సవాల్‌ విసిరారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, ప్రజాధనాన్ని వృథా చేయవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు.

శాసన వ్యవస్థ తప్పు చేస్తే న్యాయ వ్యవస్థ దానిని సరి చేస్తుందని చంద్రబాబు అన్నారు. పత్రికలు కూడా ఆ తప్పును ఎత్తి చూపుతాయన్నారు. ప్రజాస్వామ్యానికి పత్రికలు నాలుగో స్తంభంగా పని చేస్తున్నాయని, ఇవన్నీ ఒకదాని తప్పొప్పులను మరొకటి సరిచేస్తూ ఉంటాయని అన్నారు. ఏదైనా విషయాన్ని తప్పని భావిస్తే దానికి వ్యతిరేకంగా స్పందిస్తాయన్నారు. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోందని చెప్పారు. ‘‘ మూడు రాజధానుల బిల్లు సెలక్ట్‌ కమిటీకి చేరుతుంది. కమిటీ కొంత సమయం తీసుకొని బిల్లుపై అధ్యయనం చేస్తుంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నివేదిక సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం స్పందిస్తుంది’’ అని చంద్రబాబు ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

నిబంధనల ప్రకారమే ఛైర్మన్‌ వ్యవహరించారు

మండలి ఛైర్మన్‌ తెదేపాకు అనుకూలంగా వ్యవహరించలేదని, నిబంధనల ప్రకారమే ఆయన పని చేశారని చంద్రబాబు తెలిపారు. న్యాయం తెదేపా వైపే ఉందని, మండలిలో బలం ఉన్నందువల్ల ప్రజలకు న్యాయం చేయడం కోసం పోరాడుతున్నామని చెప్పారు. ‘‘ నిన్న శాసనమండలిలో జరిగినదాన్ని అందరూ చూశారు. 23 మంది మంత్రులు మండలి ఛైర్మన్‌ను తిట్టారు. దాదాపు ఆయనపై దాడి చేసినంత పని చేశారు. ఇదేం ప్రభుత్వం? ఏ1, ఏ2 అంతా అందులోనే ఉన్నారు. ఇది ప్రజా పోరాటం.. ఎప్పటికీ ఆగదు. ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి రాజధాని తరలించడం ఎవరికీ ఇష్టం లేదు’’ అని చంద్రబాబు అన్నారు.

విశాఖలో పెద్ద సంస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని చంద్రబాబు అన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామంటున్నారు, ఇది కేంద్రం ప్రభుత్వ పరిధిలోని అంశమని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. కర్నూలు జిల్లా ప్రజలు నీళ్లు కోరుకుంటున్నారని, అక్కడ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలని అన్నారు. గతంలో తాను ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు ఆపేసిందని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలు విధ్వంసాన్ని కోరుకోవడం లేదని, అభివృద్ధినే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరితోనైనా చేతులు కలపవచ్చని, అది వారి వ్యక్తిగతమని చెప్పారు. రాయలసీమ మీద నాకు ప్రేమలేదనడానికి వాళ్లెవరని చంద్రబాబు మండిపడ్డారు.

‘‘ నేను రాయలసీమ నుంచే వచ్చాను. అక్కడే పుట్టి, పెరిగాను, అక్కడే చదువుకున్నాను. ఎన్నో ప్రాజెక్టులు, పరిశ్రమలు ప్రారంభించాను. సీమవాసినని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. చిత్తూరులోని శ్రీ సిటీకి 50కి పైగా పరిశ్రమలు తెచ్చాను. రాజధాని పరిధిలోలేని ప్రాంతంలో హెరిటేజ్‌ సంస్థ భూమి కొంది. అందులో తప్పేంటి? హెరిటేజ్‌పై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. జగన్‌ సీఎం అయ్యాక సరస్వతి సంస్థకు గనులు లీజుకిచ్చారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదు. ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ తప్పులు దిద్దుకునే అవకాశం ఉంటుంది’’ అని చంద్రబాబు తెలిపారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.