close

తాజా వార్తలు

Published : 20/01/2020 13:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పారిశ్రామికవేత్తలూ... భయమక్కర్లేదు

మీకు మా భుజం అందిస్తాం
తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయ్‌
అవినీతిపై చర్యలను కఠిన వైఖరిగా చూపిస్తున్నారు
5 లక్షల కోట్ల డాలర్లనేది ఒక అడుగు మాత్రమే
మరిన్ని పెద్ద లక్ష్యాలున్నాయ్‌
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
దిల్లీ

కార్పొరేట్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తోందన్న భయాలు వీడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అవినీతిపరులపై ప్రభుత్వ ఏజెన్సీలు తీసుకుంటున్న కఠిన చర్యలను కొంత మంది తప్పుగా ప్రచారం చేస్తున్నారని వివరించారు. సోమవారమిక్కడ కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ శతవార్షిక సంబరాల్లో ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం భారత పరిశ్రమలో పారదర్శక వ్యవస్థలో ఉంది. దేశానికి సంపదను సృష్టించే విషయంలో ఎటువంటి భయం లేకుండా వారు ముందుకు అడుగువేయవచ్చు. ఇది మా నుంచి ఇచ్చే హామీ’ అని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏం అన్నారంటే..

చట్టాలను సరళతరం చేశాం: చట్టాల సంక్లిష్టతల్లో చిక్కుకున్న కంపెనీలను బయటకు తీసుకువచ్చి.. తద్వారా మెరుగైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించడానికి చట్టపర వ్యవస్థను సరళీకృతం చేస్తున్నాం. కంపెనీ చట్టంలో క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను తొలగిస్తున్నాం. పారదర్శకత తీసుకురావడం కోసం పన్ను విభాగంలో మానవ ప్రమేయాన్ని తగ్గిస్తున్నాం. ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌, రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న ఇతరత్రా పన్ను విధానాల వల్ల దేశ అభివృద్ధికి ఆటంకాలు ఎదురయ్యేవి. మేం వాటిని తొలగించాం. ఇప్పటికే పెట్టుబడులకు ఊతమివ్వడానికి కార్పొరేట్‌ పన్నును కూడా తగ్గించాం. ఏది ఏమైనా కంపెనీలకు మేం భుజాన్ని అందిస్తాం. దేశవ్యాప్తంగా వారు విస్తరించడానికి అవకాశాలను కల్పిస్తాం.ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని రెట్టింపు చేసి 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న లక్ష్యం ఒక అడుగు మాత్రమే. ఇంకా పయనించాల్సింది చాలా ఉంది. ఇంకా పెద్ద పెద్ద లక్ష్యాలే ఉన్నాయి. తక్షణ, దీర్ఘకాల పరిష్కారాలకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మౌలిక రంగంలో రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నాం.

ఐబీసీ తెచ్చింది అందుకే: ఏదైనా కంపెనీ కొన్ని పరిస్థితుల్లో చిక్కుకున్నపుడు వ్యాపారాన్ని వీడడమే మంచిది. ఏదైనా సంస్థ విజయాన్ని పొందలేకపోతే.. అందులో ఏదో తప్పు జరుగుతున్నట్లు కాదు. అటువంటి కంపెనీలు నిష్క్రమించడానికి అవకాశం ఉండాలి. ఐబీసీ అందుకే తీసుకొచ్చాం.


పరిశ్రమ పెద్దలతో ప్రధాని సమావేశం

దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులు; వృద్ధికి, ఉద్యోగాలకు అవసరమైన చర్యలు.. తదితరాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముకేశ్‌ అంబానీ, రతన్‌ టాటా, సునీల్‌ మిత్తల్‌, గౌతమ్‌ అదానీ, ఆనంద్‌ మహీంద్రా, అనిల్‌ అగర్వాల్‌ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఈ చర్చల్లో పాల్గొన్నారు. టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌, టీవీఎస్‌ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌, ఎల్‌ అండ్‌ టీ అధిపతి ఏఎం నాయక్‌ తదితరులు కూడా సమావేశానికి హాజరైన వారిలో ఉన్నారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.