close

తాజా వార్తలు

Updated : 20/01/2020 11:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అయిదేళ్లు.. రూ.102 లక్షల కోట్లు

 మౌలిక సదుపాయాలపై వెచ్చిస్తాం
 విద్యుత్తు ప్రాజెక్టులకు రూ.25 లక్షల కోట్లు
 రూ.20 లక్షల కోట్లతో రోడ్ల నిర్మాణం
రైల్వే పథకాలకు మరో రూ.14 లక్షల కోట్లు
గత ఆరేళ్లలో వెచ్చించిన మొత్తం రూ.51 లక్షల కోట్లు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

రాబోయే అయిదేళ్లలో దేశంలో రూ.102 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్ఠానికి దిగజారి, ఆర్థిక మందగమనం తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ, భారీ వ్యయాలతో పరిస్థితులు చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

దిల్లీ: దేశంలో మౌలిక సదుపాయలు మరింత మెరుగుపరచేందుకు రూ.100 లక్షల కోట్లు వెచ్చిస్తామని స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను వచ్చే అయిదేళ్లలో సాకారం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ఇక్కడ చెప్పారు. ఏయే ప్రాజెక్టులు చేపట్టాలనే విషయమై, నాలుగు నెలల వ్యవధిలోనే 70కి పైగా సమావేశాలు నిర్వహించిన సంబంధిత టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు, రూ.102 లక్షల కోట్ల పథకాలను గుర్తించారని మంత్రి తెలిపారు. మరో రూ.3 లక్షల కోట్ల పనులు కూడా తదుపరి వీటికి జతచేయొచ్చని పేర్కొన్నారు. గత ఆరేళ్లలో మౌలికంపై వెచ్చించిన రూ.51 లక్షల కోట్లకు ఇవి అదనమని వివరించారు. విద్యుత్తుకు సంబంధించి పునర్వినియోగ ఇంధన ప్రాజెక్టులు భాగమేనన్నారు. 2025కు రూ.370 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి, ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉపకరిస్తాయని మంత్రి పేర్కొన్నారు.

నూతన ప్రాజెక్టులు ఇలా

39 శాతం: కేంద్రం చేపట్టే ప్రాజెక్టులు
39 శాతం: రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించనున్న ప్రాజెక్టులు
22 శాతం: ప్రైవేటు సంస్థలకు కేటాయించేవి


ఈ రంగాలకు సంబంధించి..

విద్యుత్తు, ఇంధనం, రైల్వేలు, పట్టణాభివృద్ధి, సాగునీరు, రవాణా, విద్య, ఆరోగ్య సంరక్షణ, తాగునీరు, డిజిటల్‌ వ్యవస్థలు, వ్యవసాయం, సామాజిక వసతుల ప్రాజెక్టులను ప్రతిపాదించారు.
రూ.24.54 లక్షల కోట్లు: ఇంధనం.. ఇందులో రూ.11.7 లక్షల కోట్లు విద్యుత్తుకు
రూ.19.63 లక్షల కోట్లు: రోడ్లు
రూ.13.68 లక్షల కోట్లు: రైల్వేలు
రూ.16.29 లక్షల కోట్లు: పట్టణాల్లో సదుపాయాలు
రూ.1 లక్ష కోట్లు: నౌకాశ్రయాలు
రూ.1.43 లక్షల కోట్లు: విమానాశ్రయాలు
రూ.3.2 లక్షల కోట్లు: టెలికాం
రూ.7.7 లక్షల కోట్లు: సాగునీరు, గ్రామీణ సదుపాయాలు
రూ.3.07 లక్షల కోట్లు: పారిశ్రామిక వసతులు


ఇవీ ప్రయోజనాలు

ఈ ప్రాజెక్టుల అమలు వల్ల భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. మౌలిక వసతులు అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఇందువల్ల దేశ వృద్ధిలో ప్రజలంతా భాగస్వాములవుతారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.