close

తాజా వార్తలు

Published : 20/01/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. అడుగడుగునా ఆంక్షలు

అమరావతి పరిరక్షణ సమితి, జేఏసీ, పలు రాజకీయ పార్టీలు తలపెట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ని అడ్డుకునేందుకు పోలీస్‌శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. బెజవాడలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ముఖ్య నేతలకు  సెక్షన్‌ 149 కింద  నోటీసులు జారీ చేశారు. తెదేపా నేతలను గృహనిర్బంధం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ‘వైకాపా అరాచకాలకు అంతేలేకుండా పోయింది’

‘చలో అసెంబ్లీ’ నేపథ్యంలో అమరావతి ఐకాస, తెదేపా నేతల గృహ నిర్బంధాలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. దీనిని హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అత్యవసర పరిస్థితి సమయంలో కూడా దేశంలో ఇంత నిర్బంధం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అరాచకాలకు అంతే లేకుండా పోయిందని ఆక్షేపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. పాత విద్యుత్కేంద్రాలను మార్చికల్లా మూసేయాలి

తెలంగాణ లోని కాలుష్యాన్ని అధికంగా వెలువరిస్తున్న పాత విద్యుత్కేంద్రాల మూతకు వచ్చే మార్చి వరకూ గడువును పొడిగిస్తూ కేంద్ర విద్యుత్తుశాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది. కొత్తగూడెంలో మొత్తం 720 మెగావాట్ల 8 విద్యుత్కేంద్రాలను గత నెలాఖరుకల్లా మూసివేయాలని గతంలో కేంద్రం గడువు పెట్టింది. వీటిలో వచ్చే మార్చి వరకూ విద్యుదుత్పత్తికి అవకాశం ఇవ్వాలని ఇటీవల తెలంగాణ జెన్‌కో కేంద్ర విద్యుత్తు మండలి (సీఈఏ)కి లేఖ రాసింది. దీంతో మార్చి వరకు గడువు ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. గురుకుల విద్యార్థులకు చిరుతిళ్లు

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లోని పిల్లలకు పౌష్ఠికాహారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులకు బాలామృతం రూపంలో పౌష్ఠికాహారం అందిస్తున్న తెలంగాణ ఫుడ్స్‌ ఈ బాధ్యతలు నిర్వహించనుంది. పోషకాలతో కూడిన చిరుతిళ్ల(స్నాక్స్‌)ను తయారు చేసి సరఫరా చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. వదిలేస్తే ఆ వ్యయమంతా వృథానే..

అమరావతిలోని పరిపాలన నగరంలో సచివాలయం, విభాగాధిపతుల (హెచ్‌ఓడీ) కార్యాలయాల కోసం 45 ఎకరాల విస్తీర్ణంలో 5 టవర్లు (ఐకానిక్‌ భవనాలు) నిర్మిస్తున్నారు. ఇందుకోసం ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ విధానంలో పునాదులు పూర్తయ్యాయి. ఒక్కో భవనం పునాదికి సుమారు రూ.60 కోట్ల చొప్పున, ఐదు భవనాలకు రూ.300 కోట్ల ఖర్చయింది. సమీపంలో హైకోర్టు భవనానికి పునాదుల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. రూ.30 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఆ నిర్మాణాలు కొనసాగించకుండా వదిలేస్తే రూ.330 కోట్లు బూడిదలో పోసినట్టే అవుతుంది! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. నేడు విద్యార్థులతో ప్రధాని ‘పరీక్షా పే చర్చా’

ప్రధాని మోదీ సోమవారం ఉదయం పదకొండు గంటలకు జరిగే ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించేందుకు కొన్ని విలువైన సూచనలను విద్యార్థులతో పంచుకోనున్నారు. దిల్లీలోని తాల్‌కటోరా స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సుమారు రెండువేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, అద్యాపకులు పాల్గొంటారు.

7. అశ్లీల చిత్రాలు చూసేందుకే నెట్‌

అవిభక్త జమ్మూ-కశ్మీర్‌లో 370 అధికరణం రద్దు అనంతరం ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతను సమర్థిస్తూ నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె.సారస్వత్‌ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెట్‌ లేకపోవడం వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావమేమీ పడలేదని, అక్కడివారు ఆన్‌లైన్‌లో ‘అశ్లీల చిత్రాలు’ చూడటం మినహా చేస్తోందేమీ లేదన్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం కావడంతో ఆయన జమ్మూ-కశ్మీర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. కె4 క్షిపణి ప్రయోగం విజయవంతం

జలాంతర్గాముల నుంచి ప్రయోగించే కె4 బాలిస్టిక్‌ క్షిపణిని డి.ఆర్‌.డి.ఒ. అధికారులు ఆదివారం విశాఖ తీరానికి సుదూర ప్రాంతం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. సముద్రంలో ఉండే జలాంతర్గామి నుంచి కె4 బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించగా అది 3,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈ క్షిపణులను డి.ఆర్‌.డి.ఒ. పరిధిలోని డి.ఆర్‌.డి.ఎల్‌. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఆర్థిక వ్యవస్థకు ప్రకృతే ఆధారం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సగం కంటే ఎక్కువ భాగానికి ప్రకృతే ఆధారమని తాజా నివేదిక ఒకటి స్పష్టం చేసింది. లేనిపక్షంలో ఆర్థిక రంగం బీటలు వారే ముప్పుందని హెచ్చరించింది. ‘ప్రకృతి ముప్పు పెరుగుదల నివేదిక’ పేరుతో ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) ఆదివారం తాజా అధ్యయన నివేదికను విడుదల చేసింది. తాము పరిశీలించిన మొక్కలు, జంతువుల జాతుల్లో దాదాపు 25 శాతం మానవ కార్యకలాపాల కారణంగా అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని అందులో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. సిరీస్‌ భారత్‌ వశం

టీమ్‌ ఇండియా అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఆదివారం చివరిదైన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకుంది. మరోవైపు అండర్‌-19 ప్రపంచకప్‌ను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ ఘనంగా ఆరంభించింది. ఆరంభ పోరులో అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో అదరగొట్టి శ్రీలంకను ఓడించింది. i. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  ii. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.