హాలీవుడ్‌ హెల్మెట్‌లు
close

తాజా వార్తలు

Published : 17/01/2020 00:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హాలీవుడ్‌ హెల్మెట్‌లు

సందర్భం

ముంబయిలోని గన్స్‌ అండ్‌ హోసెస్‌ అంటే దేశంలోని చాలామంది వాహన ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. వాహనాలను అందంగా అలంకరించడంలో, ఆకట్టుకునేలా పెయింటింగ్స్‌ వేయడంలో బాగా పేరుంది. ఇదే కస్టమ్‌ పెయింటింగ్‌ షాప్‌ ఈమధ్యే సూపర్‌హీరో హెల్మెట్‌ సిరీస్‌ ఆవిష్కరించింది. హాలీవుడ్‌ సూపర్‌హిట్‌ సినిమాలు ‘డెడ్‌పూల్‌’, ‘బ్యాట్‌మన్‌’ స్ఫూర్తితో వీటిని రూపొందించారు. సినిమా టైటిల్స్‌, పాత్రలు, లోగోలు, అందులో వాడిన ఆయుధాలు శిరస్త్రాణాలపై కనువిందు చేస్తాయి. నలుపు, ఎరుపు రంగుల్లో లభ్యమవుతున్న ఈ రూ.7,500 హెల్మెట్‌లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని