close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 11/01/2020 21:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిరు సినిమాలో చెర్రీ..?

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ తేజ్‌ ఒకేసారి వెండితెరపై కనిపిస్తే చూడాలని మెగా అభిమానులు ఎంతో ఆశతో ఉన్నారు. ఇప్పటికే రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘మగధీర’ చిత్రంలో చిరంజీవి అతిథి పాత్రలో కనిపించి మెప్పించారు. చిరు కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఖైదీనంబర్‌: 150’ సినిమాలోని ఓ పాటలో రామ్‌చరణ్‌ తన డ్యాన్సులతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముచ్చటగా మూడోసారి చిరు-చెర్రీ కలిసి వెండితెరపై సందడి చేయబోతున్నారట. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో చిరుకు జంటగా త్రిష కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్‌చరణ్‌ నటించనున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఎటువంటి స్పష్టత రాలేదు. తాజాగా ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ సినిమాలో చెర్రీ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ సినిమా కోసం చెర్రీ 15 రోజుల కాల్షీట్లు కూడా ఇచ్చారట. ఏప్రిల్‌ నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.