close

తాజా వార్తలు

Updated : 10/01/2020 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. తుళ్లూరులో పోలీసుల లాఠీఛార్జి

రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరులో ఉద్రిక్తత  కొనసాగుతోంది. తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి   పాదయాత్రగా బయల్దేరిన మహిళలను గ్రామ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. తాము దైవదర్శనానికి వెళ్తున్నామని ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి కాదని, తమకు అనుమతివ్వాలని మహిళలు పోలీసులను వేడుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని, విరమించుకోవాలని చెప్పడంతో మహిళలు... పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. తెదేపా నేతల గృహనిర్బంధం

రాజధాని ఉద్యమం ఉద్ధృతం కావడంతో ఎక్కడికక్కడ తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మహిళల పాదయాత్రకు తెదేపా నేతలు హాజరయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో విజయవాడ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో తెదేపా నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. విజయవాడలో ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందు తదితరులను గృహనిర్బంధం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. మందడంలో ఉద్రిక్తత

రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో ఆందోళనలు 24వ రోజుకు చేరాయి. మందడంలో రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామ దేవత పోలేరమ్మకు మొక్కులు చెల్లించేందుకు గ్రామస్థులు ఆలయం వద్దకు చేరుకోవడంతో  పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు భారీగా మోహరించి ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు. ఈక్రమంలో మహిళలు  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. అక్కడికీ ఇక్కడికీ పరిగెత్తాలా?: జేసీ

అమరావతిలో రాజధాని పెట్టినందుకే దూరాభారంతో బాధపడ్డామని, ఇప్పుడు తల ఒక చోట మొండెం ఒక చోట అన్నట్లు.. రాజధానిని ముక్కలు చేసి మరోచోటికి తీసెకెళ్తానంటే కుదరదని తెదేపా నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ‘‘ మీరు తలకాయ అక్కడ పెడతా కాళ్లు ఇక్కడే ఉంచుతా.. చెయ్యి ఒకచోట.. కాలు ఒక చోట విసిరేస్తా అంటే.. మా పనుల కోసం ఇక్కడికీ.. అక్కడికీ పరుగెత్తాలా?’’ అని జేసీ ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. 24వరోజుకు చేరిన రాజధాని రైతుల పోరు

6. సీబీఐ కోర్టుకు హాజరైన సీఎం జగన్‌

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 17కి వాయిదా పడింది. కేసు విచారణ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి నాంపల్లి గగన్‌ విహార్‌లోని ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు. గత 8ఏళ్లుగా ఈకేసు విచారణ జరుగుతోంది. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ సీబీఐ కోర్టుకు హాజరుకావడం ఇదే తొలిసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. జేఎన్‌యూ హింస: వీసీకి హెచ్‌ఆర్డీ సమన్లు

దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై కేంద్ర మానవ వనరుల అభివృధ్ధి శాఖ(హెచ్‌ఆర్డీ) వర్సిటీ వీసీ జగదీశ్‌ కుమార్‌కు సమన్లు జారీ చేసింది. ఈ ఉదయం 11.30 గంటలకు హెచ్‌ఆర్డీ సెక్రటరీతో జగదీశ్‌ సమావేశమవ్వాలని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. సైరస్‌ మిస్త్రీ పునర్నియామకంపై స్టే

సైరస్‌ మిస్త్రీ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీ పునర్నియామకంపై సుప్రీంకోర్టు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మిస్త్రీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.  సైరస్‌ మిస్త్రీని తిరిగి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా నియమించాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) డిసెంబరు 18న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. పాక్‌.. చీకటి కళలకు ఉత్తమ ఉదాహరణ

అంతర్జాతీయ వేదికగా భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించిన దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్‌ దీటుగా బదులిచ్చింది. చీకటి కళలకు పాక్‌ ఉత్తమ ఉదాహరణ అని విమర్శించింది. ‘‘పాకిస్థాన్‌కు మా సమాధానం ఒక్కటే.. ముందు మీ దేశంలో ఉన్న సమస్యలను చూసుకుని వాటిని పరిష్కరించుకోండి. మీ అబద్ధపు కుట్రలను సాగనిచ్చేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు’ అని ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ స్పష్టంగా చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఆయుధాగారంపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడి..?

ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా లేవు. తాజాగా ఇరాన్‌  మద్దుతు ఉన్న పాపులర్‌ మొబిలైజేషన్‌ దళాలకు చెందిన ఆయుధాగారంపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడి నిర్వహించినట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని అరబిక్‌ మీడియా సంస్థ  డెర్రెజ్జార్‌24 పేర్కొంది. లెబనాన్‌కు చెందిన అల్‌ మైదీన్‌ న్యూస్‌ సంస్థ కూడా ఇజ్రాయిల్‌ విమనాలే ఈ దాడి చేసినట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.