close

తాజా వార్తలు

Published : 10/01/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. రాజధాని గ్రామాల్లో పోలీసుల మోహరింపు

ఏపీ రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు ఇవాళ రైతులు నిర్వహించతలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. రాజధాని అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో  పూజలు నిర్వహించి అనంతరం పొంగళ్లను నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలని రైతులు నిర్ణయించారు. ఈక్రమంలో పలువురు రైతునాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. రాజధాని చుట్టూ శాశ్వత సౌధాలు

అమరావతిలో శాసనసభ, శాసనమండలి, హైకోర్టు, సచివాలయాలే కాదు... ఈ నాలుగేళ్లలో చుట్టుపక్కల ప్రాంతాల్లో విభాగాధిపతుల కోసం విజయవాడ, మంగళగిరి, గుంటూరులలో బహుళ అంతస్తుల భవనాలు, సముదాయాలు 12.99 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వెలిశాయి. రాజధానిని కొత్త ప్రాంతానికి మారిస్తే ఈ భవంతుల పరిస్థితి ఏమిటి? రాజధాని ప్రాంతంలో నిర్మితమైన వివిధ విభాగాధిపతుల కార్యాలయ భవనాల పరిస్థితిపై కథనం కోసం క్లిక్‌ చేయండి 

3. పెద్దలకు రూ.440, పిల్లలకు రూ.230

మేడారం జాతరకు టీఎస్ఆ‌ర్టీసీ 50 శాతం ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ధరల పట్టికను విడుదల చేసింది. హైదరాబాద్‌ నుంచి మేడారం వెళ్లే భక్తులు ఎక్స్‌ప్రెస్‌పై రూ.440 పెద్దలకు రూ.230 పిల్లలకు చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం మహాజాతర జరగనుంది. ఈ ఏడాది 23 లక్షల భక్తులు ఆర్టీసీ బస్సుల్లో జాతరకు రాకపోకలు సాగించనున్నట్లు ఆర్టీసీ అంచనా వేసింది. ఇందుకోసం 4వేల బస్సులను నడిపేందుకు సమాయత్తమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. అక్రమ నిర్మాణాలు ఇక నేలమట్టమే!

హైదరాబాద్‌ మహానగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను పూర్తి స్థాయిలో నేలమట్టం చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. రాజధానిలో మొత్తం 15 లక్షల భవనాలున్నాయి. ఇందులో 12 లక్షల కట్టడాల నుంచి ఆస్తి పన్ను వసూలవుతోంది. మిగతా 3 లక్షలు అక్రమ నిర్మాణాలుగానే అధికారులు భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. రైతులతో గత ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం

‘రాజధాని రైతులతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలా కాదు ఏవైనా మార్పు చేయాలని రైతులు కోరితే వారికి మంచి చేసేందుకు సిద్ధంగా ఉంది’ అని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆందోళనలకో, ఎవరో బ్లాక్‌మెయిల్‌ చేస్తేనో ప్రభుత్వం లొంగదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కొత్తగా రాష్ట్రంలో హెలీపోర్ట్‌లు

వరంగల్‌, ఆదిలాబాద్‌, కొత్తగూడెం, జక్రాన్‌పల్లి, రామగుండం, మహబూబ్‌నగర్‌ (అద్దెకల్‌) ప్రాంతాల్లో నూతన విమనాశ్రయాలతో పాటు పలు ప్రాంతాల్లో హెలీపోర్ట్‌ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వరంగల్‌లో విమానాశ్రయానికి సంబంధించి మూడు మోడళ్లలో డీపీఆర్‌ తయారవుతోందన్నారు. వాటిలో ఏది బాగుంటే దానిని ఎంపిక చేస్తామని చెప్పారు. మిగతా నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి మార్చి నెలాఖరుకు స్పష్టత వస్తుందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. క్లిష్ట పరిస్థితుల్లో దేశం: సీజేఐ

దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే వ్యాఖ్యానించారు. సీఏఏపై దాఖలైన పిటిషన్లను పరిశీలించిన సందర్భంగా ఈ వ్యాఖ్య చేశారు. ‘‘చాలా విధ్వంసం కొనసాగుతోంది. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం శాంతి నెలకొనడానికి ప్రయత్నాలు జరగాలి. ఇలాంటి వ్యాజ్యాలతో ప్రయోజనం లేదు’’ అని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్‌ బోబ్డేతో పాటు జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. సీఏఏ, ఎన్‌పీఆర్‌ల అవసరం లేదు

జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌), భారత పౌరుల జాతీయ పట్టిక (ఎన్‌ఆర్‌ఐసీ)ల అవసరం లేదని, వీటి తయారీ వృథా ప్రయాస అని 106 మంది అఖిల భారత సేవల విశ్రాంత ఉద్యోగులు గురువారం కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. వీటి వల్ల ప్రజలకు ఇక్కట్లు తప్పవని అందులో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. భారత్‌కు ఆ సత్తా ఉంది

మన దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగా ఉన్నాయని.. ప్రస్తుత మందగమనం నుంచి పటిష్టంగా పుంజుకునే సామర్థ్యం, సత్తా మనకుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2024 కల్లా ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని రెట్టింపు చేసి 5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.350 లక్షల కోట్ల)కు చేర్చాలన్న లక్ష్యం దిశగా అన్ని వర్గాలు పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. నేడే ఖేలో ఇండియా మూడో సీజన్‌ ఆరంభం

దేశంలో అతిపెద్ద క్రీడా సంబరానికి వేళైంది. ఖేలో ఇండియా యూత్‌ క్రీడల మూడో సీజన్‌కు శుక్రవారం తెరలేవనుంది. ఇందిరా గాంధీ స్టేడియంలో ఆరంభోత్సవ వేడుక జరగనుంది. 13 రోజుల పాటు జరిగే ఈ ఆటల పండుగకు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అథ్లెట్లు బరిలో దిగనున్నారు. మరోవైపు తొలి టీ20 రద్దైంది. రెండో టీ20 హస్తగతమైంది.. ఇక మిగిలింది సిరీస్‌ ఫలితాన్ని తేల్చే ఆఖరి మ్యాచ్‌! శుక్రవారం శ్రీలంకతో జరిగే ఆఖరి టీ20లోనూ గెలిచి సిరీస్‌ కైవసం చేసుకోవాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. i. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  ii. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.