close

తాజా వార్తలు

Updated : 09/01/2020 20:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గాలి: వెంకయ్య

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికలతో సహా అన్ని ఎన్నికలు ఏకకాలంలో జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఫోరం ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ ఆధ్వర్యంలో ‘మనీ పవర్‌ ఇన్‌ పాలిటిక్స్‌’ పేరుతో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు జవాబుదారీతనం ఉండాలన్నారు. అభ్యర్థి కులం, మతం చూసి కాకుండా గుణం, సత్తా, నేర ప్రవృత్తి తెలుసుకొని ఓటెయ్యాలని ఓటర్లకు సూచించారు. పార్టీ కార్యక్రమాలు, జనసమీకరణకు చేస్తోన్న ఖర్చులపై రాజకీయ పార్టీలు నియంత్రణ పాటించాలని సూచించారు. మీడియా సైతం పెయిడ్‌, తప్పుడు వార్తల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఇందుకు రాజకీయనాయకులతోపాటు ప్రజలు సైతం బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని