close

తాజా వార్తలు

Published : 09/01/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. యూఎస్‌ ఎంబసీ లక్ష్యంగా ఇరాన్‌ దాడి

ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడి చేసి 80 మంది సైనికులను మట్టుబెట్టిన మరుసటి రోజే మరో దాడి చేసింది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌ను రెండు రాకెట్లు తాకాయి. యూఎస్‌ ఎంబసీకి సమీపంలో ఉన్న అత్యంతకీలకమైన గ్రీన్‌జోన్‌లో రాకెట్‌ దాడి జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రీన్‌జోన్‌లో యూఎస్‌ ఎంబసీతో పాటు పాశ్చాత్య దేశాల రాయబార కార్యాలయాలు, విదేశీ వ్యాపార సముదాయాలు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. అమ్మ ఒడికి నేడు శ్రీకారం

అమ్మ ఒడి పథకాన్ని చిత్తూరులో ముఖ్యమంత్రి జగన్‌ గురువారం ప్రారంభించనున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే పిల్లల తల్లులకు ఈ పథకం వర్తిస్తుంది. దీనిద్వారా పిల్లలను పాఠశాలలకు, కళాశాలలకు పంపే తల్లులు, సంరక్షకులకు ఏడాదికి రూ.15వేల లబ్ధి చేకూరనుంది. ఏటా జనవరి నెలలో అమ్మ ఒడి పథకానికి చెందిన డబ్బు నేరుగా తల్లుల ఖాతాల్లో జమవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. కొత్త సచివాలయానికి సుమారు రూ.400 కోట్లు

కొత్తగా నిర్మించనున్న సచివాలయ నిర్మాణ అంచనా వ్యయం రూ.300 కోట్ల నుంచి 400 కోట్ల దాకా ఉంటుందని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. నిర్మాణం పూర్తయ్యేందుకు ఏడాది సమయం పడుతుందని తెలిపింది. ఈ నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారించిన హైకోర్టు పలు వివరాలు తెలపాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ

అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. 3 నెలల్లోగా దీనికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గడువులోగా క్రమబద్ధీకరించుకోకుంటే జరిమానాతో పాటు కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్రస్థాయిలో అప్పిలేట్‌ కమిటీని ఏర్పాటుచేస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చి.. విధివిధానాలు జారీచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. రోడ్డెక్కిన రైతులపై కేసులు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రోడ్డెక్కి నినదించిన రైతులపై పోలీసులు ¸సులు నమోదు చేశారు. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద మంగళవారం అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 16వ నంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీనిపై చినకాకాని ఇన్‌ఛార్జి వీఆర్వో కొండాటి దుర్గారావు మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 18 మôదిపై కుట్రకోణం, గుంపులుగా రావటం, అడ్డగించటం, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించటం, బెదిరింపులకు గురిచేయటం వంటి ఆరోపణలకు సంబంధించి 120బీ, 143, 341, 353, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. తొలి రోజు 967 నామినేషన్లు

పురపాలక ఎన్నికలకు సంబంధించి తొలిరోజు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 967 నామినేషన్లు దాఖలయ్యాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 117 దాఖలు కాగా 94 నామినేషన్లతో పెద్దపల్లి జిల్లా తరాతి స్థానంలో ఉంది. సంగారెడ్డి జిల్లాలో 85, జగిత్యాల జిల్లాలో 71 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులతో పాటు పార్టీల అభ్యర్థులుగా కూడా వార్డులకు నామినేషన్లు వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. బొగ్గు రంగంలోకి అంతర్జాతీయ సంస్థలు

బొగ్గు రంగంలో అంతర్జాతీయ సంస్థలకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గనుల వేలంలో ఆ సంస్థలు పాల్గొనేలా నిబంధనలను సరళీకరిస్తూ జారీ చేయనున్న అత్యవసర ఆదేశాల (ఆర్డినెన్స్‌)కు ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఇంధన, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషిలు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ముజఫర్‌నగర్‌లో బాలికల హత్యకు ఆధారాల్లేవు

బిహార్‌లోని ముజఫర్‌నగర్‌లో బాలికలు హత్యకు గురయినట్లు ఆరోపణలు వచ్చిన సంచలనాత్మక కేసులో సీబీఐ సుప్రీంకోర్టుకు దర్యాప్తు పురోగతి నివేదిక సమర్పించింది. ముజఫర్‌నగర్‌లోని ఆశ్రయ గృహంలో బాలికలు హత్యకు గురైనట్టు ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. ఆ 35 మంది బాలికలు మరోచోట సజీవంగానే ఉన్నారని తెలిపింది. అయితే ఓ మహిళ, మరో పురుషుడికి సంబంధించిన అస్థిపంజరాలు మాత్రం లభించాయని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. అగ్రస్థానంలోనే కోహ్లి..

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతడు 928 పాయింట్లతో ముందుండగా.. 911 పాయింట్లతో స్టీవ్‌ స్మిత్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పుజారా ఓ స్థానం కోల్పోయి ఆరో స్థానంలో నిలిచాడు. రహానె రెండు ర్యాంకులు నష్టపోయి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. 100 కోట్ల మూగజీవాల బలి

ఆస్ట్రేలియాలో కార్చిచ్చుకు పెద్ద ఎత్తున మూగజీవాలు మరణిస్తున్నాయి. అటవీ, ఇతర ప్రాంతాల్లో వ్యాపించిన దావానలానికి బుధవారం నాటికి 100 కోట్లకు పైగా జంతువులు చనిపోయినట్లు సిడ్నీ విశ్వవిద్యాలయ నిపుణులు అంచనా వేశారు. ఒక్క న్యూ సౌత్‌వేల్స్‌లోనే 80 కోట్ల మూగజీవులు మంటల్లో మృతి చెందినట్లు వారి అంచనా. దాదాపు 48 కోట్ల జంతువులు ప్రాణాలు కోల్పోయినట్లు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ డిక్‌మేన్‌ (సైన్స్‌ ఫ్యాకల్టీ) కొద్ది వారాల క్రితం వెల్లడించారు.  తాజాగా పశు సంపద నష్టం భారీగా పెరిగినట్లు అంచనా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.