close

తాజా వార్తలు

Published : 07/01/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. తెదేపా నేతల గృహనిర్బంధం

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనకు తెదేపా మద్దతు ప్రకటించించి ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురు తెదేపా నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. రైతులు చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమం భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. వసంతరాయపురంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబును గృహనిర్బంధంలో ఉంచారు. చింతకాని, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం డాన్‌బాస్కో స్కూల్‌ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను హౌస్‌ అరెస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. దేశ విచ్ఛిన్నానికి భాజపా కుట్ర

మత ప్రాతిపదికన దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌)లను తెరపైకి తీసుకువచ్చిందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు.  వాటికి వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలతో కలిసి దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతం చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 10న హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. విశాఖలో..వసతులు పెంచండి

విశాఖపట్నం ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు ట్రామ్‌ తరహా ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం తలపెడుతోంది. ఇందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీ కోసం కన్సల్టెంటును నియమించాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సోమవారం సమీక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఈ ఏడాదే టీహబ్‌-2 వస్తోంది

తెలంగాణకు 2020 సాంకేతిక ప్రాధాన్య నామ సంవత్సరమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్‌ అయిన టీహబ్‌-2ను ఈ ఏడాదే ప్రారంభిస్తున్నామని, దేశంలోనే అతిపెద్ద ప్రొటో టైపింగ్‌ కేంద్రమైన టీ వర్క్స్‌ సైతం ఈ సంవత్సరమే ఆరంభమవుతుందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. 13 నుంచి పతంగులు, మిఠాయిల పండగ

సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జనవరి 13 నుంచి 15 వరకు అయిదో అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల (కైట్‌, స్వీట్‌) పండగను నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. 25 రాష్ట్రాలతో పాటు 50 దేశాల క్రీడాకారులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. సోమవారం తెలంగాణ పర్యాటక భవన్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో మంత్రి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. 75%హాజరు లేకున్నా అమ్మఒడి

అమ్మఒడి పథకంలో 75% హాజరు నిబంధనకు ఏపీ ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. హాజరుతో సంబంధం లేకుండా అర్హులందరికీ అమ్మఒడి పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. తొలి ఏడాది స్ఫూర్తి నింపేందుకు హాజరు నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి 75% హాజరు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. రైతుల లెక్క తేలుస్తాం

దేశంలో అసలు రైతులెందరు, వారి కుటుంబాలెన్ని అనే పక్కా గణాంకాలు ఇంతవరకూ సమగ్రంగా ఎక్కడా లేవు. ఈ లెక్కలు తేల్చడానికి కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. ప్రతి రైతు పేరు, బ్యాంకు ఖాతా, ఆధార్‌ సంఖ్యతో పాటు వారికున్న భూమి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలనేది లక్ష్యం. ఇలా కంప్యూటరీకరిస్తే వ్యవసాయాభివృద్ధికిచ్చే రాయితీల దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఏసీలు మొదలవ్వాల్సింది 24 డిగ్రీల వద్దే

ఇళ్లలో వినియోగించే అన్ని రకాల ఎయిర్‌ కండిషనర్లలో ఉష్ణోగ్రత సూచిక 24 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ప్రారంభమయ్యేలా (డిఫాల్ట్‌గా ఉండేలా) చూడాలని కేంద్రం స్పష్టం చేసింది. ‘ఇంధన సమర్థత మండలి’ (బీఈఈ)తో సంప్రదించిన మీదట కేంద్ర సర్కారు తాజా ప్రమాణాలను ప్రకటించిందని విద్యుత్‌ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. 10గ్రా. పసిడి @ రూ.42,000

బంగారం ధరల భగభగలు మరింత తీవ్రమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా సోమవారం నాటి బులియన్‌ ట్రేడింగ్‌లో మేలిమి (999 స్వచ్ఛత) బంగారం 10 గ్రాములు రూ.42,000 అధిగమించింది. వెండి కూడా కిలో రూ.49,200కు చేరింది. ఈనెల 26 నుంచి శుభ ముహూర్తాలు ఉండటంతో, బంగారం - వెండి కొనుగోలు చేయాలనుకుంటున్న కుటుంబాల వారు మాత్రం ఈ ధరలతో బెంబేలు పడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. బోణీ ఎవరిదో..?

కొత్త సంవత్సరంలో బోణీ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న టీమ్‌ఇండియా ధనాధన్‌ పోరుకు సిద్ధమైంది. పొట్టి సిరీస్‌లో తొలి మ్యాచ్‌ రద్దు కాగా.. మంగళవారం జరిగే రెండో టీ20లో శ్రీలంకను ఢీకొట్టనుంది. తెలుగమ్మాయి యర్రాజి జ్యోతి చరిత్ర  సృష్టించింది. సీనియర్‌ మహిళల 100మీ. హర్డిల్స్‌లో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. అఖిల భారత అంతర్‌ విశ్వవిద్యాలయాల అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 100మీ. హర్డిల్స్‌లో 13.037 సెకన్ల టైమింగ్‌తో లక్ష్యాన్ని చేరుకున్న ఆమె 2002లో అనురాధ బిస్వాల్‌ (13.38సె) నెలకొల్పిన రికార్డును  తిరగరాసింది. i. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి. ii. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.