close

తాజా వార్తలు

Published : 06/01/2020 08:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. తెల్లవారక ముందే భక్తులు ఆలయాలకు చేరుకోవడంతో కిక్కిరిసి పోయాయి. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు భక్తుల భారీగా తరలివచ్చారు. పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. కెన్యా మిలటరీ క్యాంపుపై ఉగ్రదాడి

అమెరికా- కెన్యా సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరిగి కొన్ని గంటలైన కాకముందే మరో దాడి జరిగింది. కెన్యాలోని లమూ తీర ప్రాంతంలో ఉన్న కెన్యా-అమెరికా మిలిటరీ స్థావరంపై సోమాలియాకు చెందిన జిహాదా సంస్థ అల్‌-షబాబ్‌ దాడి చేసింది. ఈ ఉగ్రదాడిలో ముగ్గురు అమెరికా పౌరులు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. మృతిచెందిన వారిలో ఒకరు  మిలిటరీకి చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు కాంట్రాక్టర్లు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. మ్యాచ్‌ను ముంచేశారు..!

భారత క్రికెట్‌ అభిమానులకు నిరాశ. 2020లో కోహ్లీసేన తొలి మ్యాచే వర్షం, నిర్వాహకుల వైఫల్యం వల్ల రద్దయింది. ఆదివారం భారత్‌, శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. కవర్లు కప్పినా.. పిచ్‌ అక్కడక్కడా పచ్చిగా మారడంతో అంపైర్లకు మ్యాచ్‌ను రద్దు చేయడం తప్ప మరో మార్గం లేకపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. అమరావతి రైతులూ.. చర్చలకు రండి

అమరావతి రైతులు ప్రభుత్వంతో చర్చకు వచ్చి వారి డిమాండ్లను వివరిస్తే న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆదివారం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో వైకాపా నాయకులు కనుమూరి రామిరెడ్డి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మాటలు నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. సత్వర సాయానికి సంజీవనులు

రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు తొలిగంటలో అందించే చికిత్స అతి కీలకం. అయితే సత్వర సాయం అందకపోవడం వల్ల రోడ్డు ప్రమాద బాధితుల్లో ఎక్కువమంది ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. దీన్ని నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 28 ట్రామా కేర్‌ సెంటర్లను కొత్తగా నెలకొల్పాలని నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.20 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేస్తోంది. వైద్యకళాశాలల్లో కొన్ని ఏర్పాటు చేయనుండగా.. మరికొన్నింటిని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో నెలకొల్పడానికి సన్నాహాలు చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. స్పష్టత వచ్చాకే స్పందిస్తాం

రాజధాని మార్పు నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే కేంద్రం స్పందిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలో సీఏఏపై భాజపా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఎటువంటి నష్టం, ఇబ్బంది లేకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. మరో ముగ్గురు నేవీ ఉద్యోగుల అరెస్టు

వలపు వలలో చిక్కి దేశ భద్రత రహస్యాలను పాకిస్థాన్‌కు అందజేసిన కేసులో మరో ముగ్గురు నౌకాదళ ఉద్యోగులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. ఇదే కేసులో గత నెలలో ముంబయి, విశాఖపట్నం, కార్వార్‌ నౌకాదళ కేంద్రాల్లో పనిచేస్తున్న ఏడుగురు నేవీ ఉద్యోగులు, ఒక హవాలా ఆపరేటర్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ గూఢచర్య రాకెట్‌లో మరికొందరి ప్రమేయమున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ట్రస్టుల పేరుతో నల్లధనం నిల్వ

నల్లధనం ఆచూకీ కనిపెట్టడంలో మరో ముందడుగు పడింది. పన్ను బెడదలేని ప్రాంతాల్లో కొందరు ధార్మిక సంస్థలు (ట్రస్టులు) ఏర్పాటు చేసి, వాటి పేరుతో చేసిన లావాదేవీలపై భారత్‌-స్విట్జర్లాండ్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. భారత్‌లో పన్ను ఎగవేసి, విదేశాల్లో స్థిరపడ్డవారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. 2019లో టెక్‌ అంకురాల్లోకి రూ.99,400 కోట్లు

భారతీయ సాంకేతిక (టెక్‌) అంకురాల్లోకి గత ఏడాది 14 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.99,400 కోట్లు) పెట్టుబడులు తరలి వచ్చినట్లు పరిశోధన- కన్సల్టింగ్‌ సంస్థ హెక్జెన్‌ తాజా నివేదికలో వెల్లడించింది. 2018లో టెక్‌ అంకురాల్లోకి వచ్చిన పెట్టుబడులతో  పోలిస్తే ఇది 18 శాతం అధికమని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్‌ వేడుక


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.