close

తాజా వార్తలు

Published : 06/01/2020 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గగన యోగాన్ని వదిలి పల్లియోడానికి!

చేతిలో ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజినీరింగ్‌  డిగ్రీ పత్రాలు... మరోవైపు విదేశాల్లో మంచి జీతంతో ఉద్యోగావకాశం... కానీ విష్ణువేణు ఆచారి అనే  యువకుడు తృణప్రాయంగా  ఆ అవకాశాలను వదిలేశాడు. కారణం తన ప్రాణానికి ప్రాణమైన  ఓ అరుదైన కళకు జీవం పోసేందుకు...
వంపు సొంపుల పంపా నది... బారులు తీరిన పడవలు... తిరుగు జలాల్లో అవి శరవేగంగా పరుగులు తీస్తుంటే... ఆ దృశ్యం ఓ అద్భుతం  అనిపిస్తోంది కదా...

పడవలను కేరళీయులు పల్లియోడంలని పిలుస్తారు. వాటి ఆకారాన్నిబట్టి పాము పడవలు అని కూడా అంటుంటారు. వాటితో జరిగే పందేల సందడి అందరికీ తెలిసిందే. కేరళ సంప్రదాయాల్లో ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ పడవల తయారీ కూడా ఎంతో సంక్లిష్టమైంది. కర్ర ఎంపిక నుంచి వాటి నమూనాలు, రూపకల్పన అంతా ఎంతో సంప్రదాయబద్ధంగా, శ్రద్ధాసక్తులతో చేయాల్సి ఉంటుంది. దీనికోసం వన్‌మజి పల్లియోడ కరయోగం పేరుతో ఓ శాస్త్రమే ఉంది. విష్ణు వేణు ఆచారిది ఈ పడవల తయారీకి పేరొందిన అరన్ముల ప్రాంతం. విష్ణు తండ్రే కాదు అతని ముందు అయిదు తరాల వారూ ఈ పడవల తయారీలో నిష్ణాతులే. వీరి చేతుల్లో రూపుదిద్దుకున్న వందల కొద్దీ పల్లియోడలు హైలెస్సో... హైలెస్సా అంటూ పరుగులు తీస్తుంటే... ఆ ఆనందోత్సవాలను చూడ్డానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది తరలి వస్తుండేవారు. ఈ పడవలు తయారు చేసిన వీరి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా చూసేవారు. ఈ సంఘటనలన్నీ విష్ణు మనసులో నాటుకుపోయాయి. కాలం మారింది... రాన్రాను ఈ పడవలను తయారు చేసే వాళ్ల సంఖ్య తగ్గిపోసాగింది. ఈ క్రమంలోనే 2010లో విష్ణు ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ తీసుకున్నారు. కానీ ఆ ప్రాంతంలోనే కాదు... తన కుటుంబంలోని చాలా మంది ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోతుండడం విష్ణును ఆలోచనలో పడేసింది. ఈ కళాత్మక వృత్తి తన తరంలోనే అంతర్థానమవుతుందా? అన్న ప్రశ్న అతన్ని నిలవనీయలేదు. అందుకే మంచి ఉద్యోగం, నెలకు లక్షల్లో జీతం వచ్చే అవకాశం ఉన్నా వాటిని వద్దనుకున్నాడు. స్వగ్రామం వచ్చి పడవల తయారీలో మెలకువలు తెలుసుకోవడం మొదలుపెట్టాడు. పల్లియోడ కరయోగాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఈ అరుదైన కళకు జీవం పోస్తున్నాడు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.