close

తాజా వార్తలు

Published : 05/01/2020 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

1. మేయర్లు, ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

తెలంగాణలోని కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యారు. 13 నగరపాలక సంస్థల్లో ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, బీసీలకు 4, జనరల్‌కు 7 స్థానాలు కేటాయించారు. 123 మున్సిపల్‌ ఛైర్మన్లలో ఎస్టీలకు 4, ఎస్సీలకు 17, బీసీలకు 40, జనరల్‌కు 62 స్థానాలు కేటాయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. రాజధాని మారిస్తే చూస్తూ ఊరుకోం: కన్నా

ఏపీ సీఎం జగన్‌ నియమించిన కమిటీ ఆయన ఆలోచనల మేరకే నివేదిక ఇస్తుందని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... స్టేక్‌ హోల్డర్స్‌ ఆమోదం లేకుండా ఇష్టం వచ్చినట్లు రాజధాని మార్చే అధికారం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. రాజధాని అంశంపై భాజపాలో భిన్నాభిప్రాయాలు లేవని, తాము స్పష్టంగా ఉన్నామని చెప్పారు. రాజధాని వ్యవహారంపై భాజపా చూస్తూ ఊరుకోదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. మిలియన్‌ మార్చ్‌ నిర్వాహకులపై కేసు నమోదు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్‌ఆర్‌సీ), జాతీయ పౌర పట్టిక(ఎన్‌పీఆర్‌)లకు వ్యతిరేకంగా పలు ముస్లిం సంఘాలు, సివిల్‌ సొసైటీ సంస్థలు శనివారం హైదరాబాద్‌లో మిలియన్‌ మార్చ్‌ నిర్వహించాయి. మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా  ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించినందుకు సీఏఏ, ఎన్‌ఆర్సీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌  ముస్తాక్‌ మాలిక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. షరతులతో కూడిన  అనుమతులను అతిక్రమించినందుకే కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. అమరావతిపై విష ప్రచారం ఆపాలి

అమరావతి ప్రజల పోరాటం కొనసాగుతోంది. రాజధాని మార్చవద్దంటూ దీక్షలు, మహాధర్నాలతో హోరెత్తిస్తున్నారు. మందడం, ఎర్రబాలెం, నీరుకొండ, తుళ్లూరుతో పాటు రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల్లో రిలే దీక్షలు 19వ రోజుకు చేరాయి. ఆందోళన చేస్తున్న రైతులు.. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. అమరావతిపై విషప్రచారం ఆపాలని రైతులు డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

5. నగరానికి చేరుకున్న చరితారెడ్డి మృతదేహం

చరితారెడ్డి మృతదేహాన్ని శంషాబాబాద్‌ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కాసేపట్లో నేరేడ్‌మెట్‌ రేణుకానగర్‌లోని ఆమె నివాసానికి తరలించనున్నారు. చరితారెడ్డి పార్థివ దేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు అయ్యే ఖర్చులను జమ చేసేందుకు ఆమె స్నేహితులు చేయీ చేయీ కలిపారు. అందరూ ఫేస్‌బుక్‌ ఆధారంగా ప్రత్యేక ఖాతాను తెరిచి క్రౌడ్‌ ఫండింగ్‌ చేశారు. డిసెంబరు 27న అమెరికాలోని మిచిగాన్‌ పరిధి లాన్సింగ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చరితారెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే.

6. ఆటో డ్రైవర్‌కు 38ఎకరాలు..

అమలాపురానికి చెందిన వాసంశెట్టి వెంకటరమణ వేపగుంటలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణ పథకాలకు వాలంటీరు ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అర్హుల జాబితా పరిశీలనలో విస్తుపోయే వివరాలు కనిపించాయి. ఆ కుటుంబానికి మెట్ట 37.7 ఎకరాలు, మగాణి 0.49 ఎకరాలు ఉన్నట్టు తప్పుగా నమోదై ఉంది. తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి అర్హులు చేయాలని వెంకటరమణ కుటుంబం వేడుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఎన్‌సీపీకే కీలక శాఖలు

మహారాష్ట్రలో ఎట్టకేలకు మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మంత్రులకు కేటాయించిన శాఖల ప్రతిపాదిత జాబితాకు శనివారం గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆమోదం తెలిపారు. ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఎన్‌సీపీ నేత అజిత్‌ పవార్‌కు కీలక ఆర్థిక శాఖను కేటాయించారు. ఉద్ధవ్‌ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రేకు పర్యాటక, పర్యావరణ, ప్రొటోకాల్ మంత్రిత్వ శాఖల్ని కేటాయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. బుమ్రా రీఎంట్రీనే మా సానుకూలాంశం: మలింగ

నాలుగు నెలల తర్వాత బరిలోకి దిగుతున్న టీమిండియా పేస్ దళపతి జస్ప్రీత్‌ బుమ్రా తన లయను అందుకోవడానికి కొంత సమయం పడుతుందని శ్రీలంక సారథి లసిత్‌ మలింగ అభిప్రాయపడ్డాడు. ‘‘బుమ్రాకు మంచి నైపుణ్యం, కచ్చితత్వం ఉంది. కానీ గాయంతో నాలుగు నెలలు క్రికెట్‌కు దూరమైన బౌలర్లు పునరాగమనంలో తిరిగి తమ లయను అందిపుచ్చుకోవడానికి కొన్ని మ్యాచ్‌ల సమయం పడుతుంది. ఇది మాకు సానుకూలాంశం’’అని మలింగ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. సులేమానీపై సైలెంట్‌ కిల్లర్‌ గురి..?

అమెరికా దౌత్యకార్యాలయంపై దాడి వెనుక సులేమానీ హస్తం ఉందని భావించిన అమెరికా అతడిని ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకొంది. అప్పటికే అతడి కదలికలపై అమెరికా, ఇజ్రాయిల్‌, సౌదీలు కొన్నేళ్లుగా నిఘా పెట్టాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రకారం..  పెంటగాన్‌ అత్యంత నమ్మకమైన వేగులు అందించిన సమాచారం, ఎలక్ట్రానిక్‌ తరంగాలను విశ్లేషించి, నిఘా విమానాలు అందించిన సమాచారం, ఇతర గూఢచర్య తంత్రాలను వాడి సులేమానీ బాగ్దాద్‌కు వస్తున్నట్లు ధ్రువీకరించించగా.. ఆ ఆపరేషన్‌కు ట్రంప్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఈ ఏడాది అంగారక యాత్రకు సిద్ధమైన పలు దేశాలు



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.