close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/01/2020 22:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అలీ కొత్త అవతారం..!

హైదరాబాద్‌: ప్రముఖ హాస్య నటుడిగా, వ్యాఖ్యాతగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న అలీ సరికొత్త అవతారం ఎత్తారు. ‘అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దీనికి సంబంధించిన లోగోను శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అలీ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సినీ ప్రముఖులు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, జయచంద్ర, శ్రీలేఖ, రవివర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. తన సంస్థ ద్వారా వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు, సీరియల్స్, వాణిజ్య చిత్రాల్ని రూపొందిస్తానని తెలిపారు. శ్రీబాబా నేతృత్వంలో క్రియేటివ్ డైరెక్టర్ మనోజ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ సంస్థ కార్యకలాపాలు జరుగుతాయన్నారు. రాబోయే రోజుల్లో వెబ్ సీరీస్‌లకు మంచి ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. 24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన సేవలను తమ సంస్థ ద్వారా అందిస్తామని, తను తీయబోయే వెబ్ సిరీస్‌లు, టీవీ షోలను ఆదరించాలని అలీ కోరారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.