close

తాజా వార్తలు

Published : 04/01/2020 17:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 5 PM

1. బోస్టన్‌ కమిటీ అంతా బూటకం: చంద్రబాబు

రాజధాని కోసం భూములిచ్చిన 29 వేల మంది రైతులు మనోవేదనతో ఉన్నారు.. ఇప్పటికైనా ప్రభుత్వం నాటకాలు ఆపి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బోస్టన్‌ కమిటీ నివేదికపై మండిపడ్డారు. బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ క్లయింట్‌ వద్ద డబ్బులు తీసుకుని ఏది కావాలంటే అది రాసిచ్చే సంస్థ అని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. పురపాలికల్లో విజయం మనదే: కేసీఆర్‌

తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలోనూ తెరాస విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలతో తెలంగాణ భవన్‌లో ఆయన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. జగన్‌ మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి: నారాయణ

మూడు రాజధానులు చేయాలంటే జగన్‌ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బాలాజీసెంటర్‌లో ఐకాస ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. వంటావార్పులో తెదేపా, జనసేన, వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. పురపాలక రిజర్వేషన్ల తొలిదశ ప్రక్రియ పూర్తి

తెలంగాణ పురపాలక ఎన్నికల రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఎస్టీ జనాభా ఒక శాతానికి తక్కువగా ఉన్న కార్పొరేషన్లలో ఒక వార్డును ఎస్టీలకు కేటాయించారు. మున్సిపాలిటీల్లోనూ ఒక వార్డును ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు. మిగతా స్థానాల్లో 50 శాతానికి మించకుండా బీసీలకు కేటాయించారు. అన్ని కేటగిరీల్లోనూ సగం సీట్లను మహిళలకు కేటాయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. కమిటీలు అవసరం లేదు..అమరావతే కావాలి

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు నిర్వహిస్తోన్న మహాధర్నా 18వ రోజుకు చేరింది. తుళ్లూరులో రైతులు, మహిళలు, విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. బోస్టన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను రైతులు తీవ్రంగా తప్పుబట్టారు. రాజధాని అంశంపై ఎటువంటి కమిటీలు అవసరం లేదని అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటన చేసే వరకూ తమ పోరాటం ఆగదని రైతులు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. భాజపాలో చేరిన యామిని శర్మ

ఇటీవల తెదేపాను వీడిన సాదినేని యామిని శర్మ భాజపాలో చేరారు. శనివారం కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన భాజపా సీనియర్‌ నేత, కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకొన్నారు. గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆమెకు పార్టీ కండువా కప్పి కమల దళంలోకి ఆహ్వానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. ఇక రోహింగ్యాలపై దృష్టి: కేంద్ర మంత్రి

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు కొనసాగుతున్న వేళ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం దేశంలోకి చొరబడ్డ రోహింగ్యాలను తిప్పి పంపడంపై దృష్టి సారించనుందని తెలిపారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని, సీఏఏ ద్వారా వారికి ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఇక ఆదాయపు పన్ను కట్టడం మర్చిపోరు

‘అయ్యయ్యో.. పన్ను కట్టడం మర్చిపోయానే. లాస్ట్‌ డేట్‌ చూసుకోలేదే’ అనుకునే సందర్భాలు సహజమే. పన్ను సంగతి గుర్తున్నా.. కొన్ని సార్లు గడువు తేదీ మర్చిపోతుంటారు. అలాంటి వారి కోసమే ఆదాయపు పన్ను శాఖ ఓ శుభవార్త చెప్పింది. పన్ను కట్టే సమయం మర్చిపోకుండా ఉండేలా 2020 క్యాలెండర్‌ను రూపొందించి విడుదల చేసింది. ‘ఏ రోజున పన్ను కట్టాలి.. చివరి తేదీ ఎప్పుడు’ లాంటి వివరాలను ఇందులో పొందుపర్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. తల్లిదండ్రులకు చెప్పకుండానే పాండ్య నిశ్చితార్ధం!

టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గురించి మరో సంచలన విషయం తెలిసింది. తల్లిదండ్రులకు చెప్పకుండానే అతడు నటాషా స్టాంకోవిచ్‌తో నిశ్చితార్ధం చేసుకున్నాడట. ఈ సంగతిని స్వయంగా అతడి తండ్రి హిమాన్షు పాండ్యయే చెప్పాడు. ‘‘కొత్త సంవత్సరం సందర్భంగా వారిద్దరూ దుబాయ్‌కి వెళ్తున్నారని మాకు తెలుసు. నిశ్చితార్ధం గురించి మాత్రం అస్సలు తెలియదు. ఈ ఘటన మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది’’అని తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. యూఎస్‌లో పాక్‌ సైనికుల శిక్షణ పునరుద్ధరణ

పాకిస్థాన్‌ సైనికులకు అమెరికాలో శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని పునరుద్ధరించేందుకు ట్రంప్‌ పాలక వర్గం ఆమోదం తెలిపింది. అయితే ఈ నిర్ణయం వల్ల పాక్‌కు పూర్తి స్థాయి రక్షణ సహకారంపై అమెరికా విధించిన రద్దుపై ఎలాంటి ప్రభావం ఉండదని విదేశాంగ శాఖ దక్షిణాసియా విభాగం అసిస్టెంట్‌ సెక్రటరీ అలైస్ జి వెల్స్‌ స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.