close

తాజా వార్తలు

Published : 03/01/2020 09:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. నేటి నుంచి సకల జనుల సమ్మె

నేటి నుంచి ఏపీ రాజధాని గ్రామాల్లో సకల జనుల సమ్మె చేస్తామని రాజధాని రైతుల ఐకాస నేతలు ప్రకటించారు. ఆస్పత్రులు, మందుల దుకాణాలు, పాల సరఫరా తప్ప మిగతా కార్యకలాపాలన్నీ బంద్‌ చేయనున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని రాజధాని రైతుల ఐకాసకు చెందిన సుధాకర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. పుస్తక మహోత్సవం నేటి నుంచి

విజయవాడలో ఏటా ఘనంగా జరిగే పుస్తక మహోత్సవం మళ్లీ వచ్చేసింది. ఈ నెల 12 వరకూ కొనసాగే పండుగను స్వరాజ్యమైదానంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రారంభిస్తారు. ఈ మేరకు విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం(వీబీఎఫ్‌ఎస్‌) గౌరవాధ్యక్షుడు బెల్లపు బాబ్జి, అధ్యక్షుడు లక్ష్మయ్య, ఎమెస్కో ప్రచురణ సంస్థ అధినేత విజయకుమార్‌ గురువారం వివరాలు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. టిప్పర్‌ ఢీకొని 250 గొర్రెలు మృతి

వరంగల్‌ గ్రామీణ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి సమీపంలోని పాకాల వాగు వంతెనపై గురువారం అర్ధరాత్రి టిప్పర్‌ ఢీకొని 250 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... పాకాల - వాజేడు అటవీ ప్రాంతంలో గొర్రెల యజమాని తన 600 గొర్రెలు మేపుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి అతి వేగంగా మట్టి లోడుతో వచ్చిన టిప్పర్‌ గొర్రెల మీదుగా వెళ్లింది. ప్రమాదంలో 250 గొర్రెలు మృతి చెందాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. పాఠ్యాంశంగా నైతిక విలువలు

వచ్చే విద్యాసంవత్సరం నుంచి నైతిక విలువలను పాఠ్యాంశంగా చేర్చబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఇందుకోసం మాజీ డీజీపీలతో కమిటీ వేస్తామని, చినజీయర్‌ స్వామి సలహాలు తీసుకుంటామని తెలిపారు. మాజీ డీజీపీ హెచ్‌.జె.దొర రచించిన తన ఆత్మకథ ‘జర్నీ త్రూ టర్బులెంట్‌ టైమ్స్‌’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి గురువారం ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఉంటే కేసులు పెట్టొచ్చుగా?

‘ఏపీ రాజధానికి భూసేకరణలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఇప్పటికే పలుసార్లు చెప్పారు. అధికారం మీ చేతుల్లో ఉంది.. వారిపై కేసులు నమోదు చేయవచ్చు కదా. చెప్పిందే మళ్లీమళ్లీ చెబుతూ కాలం ఎందుకు వెళ్లదీస్తున్నారు?’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గురువారం ప్రకటనలో ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ధైర్యముంటే పాక్‌ను నిలదీయండి

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వద్దంటున్నవారు నిజానికి తమ నిరసనను పాకిస్థాన్‌పై వ్యక్తంచేసి, ఆ దేశం గత 70 ఏళ్లుగా సాగిస్తున్న మతపరమైన పీడనను ప్రపంచం ముందు ఎండగట్టాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. పొరుగు దేశాల్లో వేధింపులకు గురై శరణార్థులుగా భారత్‌కు వచ్చిన అల్పసంఖ్యాక వర్గాల వారికి రక్షణ కల్పించి, అండదండలు అందించడం మన ‘సాంస్కృతిక, జాతీయ బాధ్యత’ అని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. త్వరలో పితృత్వ సెలవులు!

కేంద్ర కార్మిక శాఖ పురుష ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక ఇవ్వనుంది. ఇకపై ఉద్యోగులకు పితృత్వ సెలవులు ఇచ్చేలా విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయమై సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వశాఖతో చర్చలు ప్రారంభించింది. ఈ చర్చలు తుది దశకు వచ్చినట్లు మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. అందుకే వాళ్లు మాంసం తింటారు

మన సంస్కృతి, సంప్రదాయాల గురించి ఎవ్వరూ చెప్పకపోడం వల్లనే విదేశాలకు వెళ్లిన భారతీయ పిల్లలు గొడ్డు మాంసం తినడం అలవాటు చేసుకుంటారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌ అన్నారు. బిహార్‌లోని బెగుసరాయ్‌లో ‘శ్రీమద్‌ భాగవత్ కథా జ్ఞ్యాపన్‌’ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. రైలు సమాచారమంతా 139 లోనే

రైలు ప్రయాణికులు ఒక్కో రకమైన సమస్యకు ఒక్కో ఫోన్‌ నంబరుకు డయల్‌ చేయాల్సిన అవసరం లేకుండా 139 ద్వారానే ఆ పని పూర్తి చేసుకునేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేసింది. దీంతో ఇంతకుముందు ఉన్న నంబర్లన్నీ రద్దయ్యాయి. 139 నుంచి 12 భారతీయ భాషల్లో సేవలు అందనున్నాయి. అన్ని రకాల ఫోన్ల ద్వారా ఈ సేవల్ని పొందవచ్చు. అత్యవసర సేవలకు 182 మాత్రం కొనసాగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. బాగ్దాద్‌ విమానాశ్రయంపై రాకెట్‌ దాడి

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ దాడి జరిగింది. శుక్రవారం వేకువజామున జరిగిన ఈ దాడిలో ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నత స్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మృతిచెందారు. ఇరాన్‌ నిఘా విభాగాధిపతి ఖాసీం సోలెమన్‌ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాక్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.