close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 03/01/2020 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

2020 ప్రతి నెలా పర్యాటకమస్తు

గణతంత్ర దినోత్సవం.. ఆదివారం! దసరా.. ఆదివారం! దీపావళి.. రెండో శనివారం! కొత్త క్యాలెండర్‌ చూడగానే.. సెలవుల్లో పండగలొచ్చాయని నిరుత్సాహపడుతున్నారా? ప్రణాళిక సరిగ్గా వేసుకోగలిగితే.. 2020లో ప్రతి నెలా పండగ చేసుకోవచ్ఛు కాస్త సెలవులు సర్దుబాటు చేసుకోగలిగితే.. వారాంతాలు విహార యాత్రలకు దారి చూపుతాయి. ఇంకేం నచ్చిన ప్రదేశానికి వెళ్లిపోవచ్ఛు కొత్త ఏడాదంతా కొంగొత్తగా ఆస్వాదించొచ్ఛు


సంక్రాంతితో మొదలు

జనవరి 11-15

తెలుగుదనం నిండుగా ఉండే పండగ సంక్రాంతి. పల్లెలన్నీ ధాన్యరాశులతో తులతూగుతాయి. ఈ మూడు రోజుల పండక్కి.. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉంటారు. ఇంకా లేదా..? అయితే ఇప్పుడు తయారవ్వండి. రెండో శనివారం, ఆదివారం కలిసి వస్తున్నాయి. జనవరి 13న గానీ సెలవు పెట్టుకోగలిగితే.. 11 నుంచి 15 వరకు మొత్తంగా ఐదు రోజుల పర్యటనకు వెళ్లిపోవచ్ఛు కోనసీమ నుంచి కోణార్క్‌ దాకా, పల్లెసీమ నుంచి పొరుగు రాష్ట్రం వరకు ఎక్కడికైనా వెళ్లొచ్ఛు చలిగా ఉన్నా.. ఈ సమయం విహారానికి అనుకూలం.

ఇవి చూడండి: రాజస్థాన్‌లోని జైపుర్‌, జైసల్మేర్‌, అండమాన్‌ నికోబార్‌, ఒడిశాలో పూరి, కోణార్క్‌ సందర్శనకు అనుకూల సమయమిది. సాహస యాత్రికులు లద్దాఖ్‌లోని చాదర్‌ ట్రెక్‌లో పాల్గొనొచ్ఛు గుల్‌మార్గ్‌లో మంచుతో ఆడుకోవచ్ఛు


శివోహం

ఫిబ్రవరి 21-23

శివరాత్రి శుక్రవారం రావడంతో.. శని, ఆదివారాలు కలుపుకొని మూడు రోజుల పర్యటనకు వెళ్లిపోవచ్ఛు మార్చి నుంచి ఎలాగూ పిల్లలకు పరీక్షా కాలం. వాటికి ముందు ఆటవిడుపుగా చిన్న టూరు వెళ్లొస్తే పిల్లల్లో కొత్త ఉత్సాహం వస్తుంది.

ఇవి చూడండి: తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు చుట్టిరావొచ్ఛు శ్రీశైలం, కాళేశ్వరం, వేములవాడ, పంచారామాలు తదితర పుణ్యక్షేత్రాలు చూడొచ్ఛు తిరుమలలో రద్దీ సాధారణంగా ఉండే సమయమిది. స్వామివారి దర్శనానికీ వెళ్లిపోవచ్ఛు పనిలోపనిగా శ్రీకాళహస్తి కూడా చూసిరావొచ్ఛు


రంగుల కేళి

మార్చి 7-10

శని, ఆది తర్వాత సోమవారం సెలవు పెట్టుకోగలిగితే హోళీకి నాలుగు రోజులు కలిసి వస్తుంది. ఇప్పట్నుంచే ప్లాన్‌ చేసుకుంటే కాస్త దూర ప్రదేశాలకైనా వెళ్లి రంగుల సందడిని రెట్టింపు చేసుకోవచ్ఛు.

ఇవి చూడండి: ఉత్తరాదిలో హోళీ కోలాహలంగా సాగుతుంది. పండగ వేళ మథుర, బృందావనం అద్భుతంగా ఉంటాయి. ముంబయిలో హోళీ సంబరం అంబరాన్నంటుతుంది. రాయల రాజధాని హంపిలో రంగుల పండగ కోసం దేశదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తారు. ఆ సందడిలో మీరూ పాలుపంచుకోండి.


రామా.. కనవేమిరా!

ఏప్రిల్‌ 2-5, 10-14

ఎండలు మొదలయ్యే ఏప్రిల్‌ నెలలో రెండు వారాంతాలు పర్యాటకులకు కలిసి వస్తున్నాయి. మొదటివారంలో శ్రీరామనవమి, రెండోవారంలో గుడ్‌ ఫ్రైడే సందడి చేయనున్నాయి. ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి సెలవు. 13న సెలవు పెట్టుకోగలిగితే.. 10 నుంచి 14 వరకు సందడే సందడి. పిల్లలు చదువులతో బిజీగా ఉంటే.. ఇంట్లోని పెద్దలను తీర్థయాత్రలకు పంపండి. ఉత్తరాది పర్యటనకు కొంత అనుకూల సమయమిది.

ఇవి చూడండి: అయోధ్య, వారణాసి, రుషీకేశ్‌, హరిద్వార్‌ వంటి పుణ్యక్షేత్రాలతో పాటు ముస్సోరి, డార్జిలింగ్‌, కులు-మనాలి వంటి శీతల కేంద్రాలు చూసి రావొచ్ఛు దక్షిణాదిలో కర్ణాటకలోని కూర్గ్‌, తమిళనాడులోని ఎలగిరి, కేరళలోని పర్వత ప్రాంతాలకు వెళ్లొచ్ఛు


చలో చార్‌ధామ్‌

మే మాసంలో

మేలో ఎండలు మెండు. పిల్లలకు సెలవులు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి ఇబ్బందేం ఉండదు. ఇతర రంగాల్లోని వారు పిల్లల కోసం ఓ వారం రోజులు సెలవు తీసుకోగలిగితే.. వేసవిలో ఘనంగా విహరించొచ్ఛు మంచుకొండల్లోని మహిమాన్విత క్షేత్రాలను సందర్శించి రావొచ్ఛు విదేశీ విహారానికి వెళ్లొచ్ఛు అంత ఖర్చు పెట్టలేమనుకునేవారు స్థానికంగా ఉన్న వేసవి విహార కేంద్రాలు చుట్టేయొచ్ఛు

ఇవి చూడండి: చార్‌ధామ్‌ పుణ్యక్షేత్రాలు ఏప్రిల్‌ చివరి వారంలో తెరుచుకోనున్నాయి. ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే మంచిది. కశ్మీర్‌ పర్యటన ఈ సమయంలో మధురానుభూతిగా మిగిలిపోతుంది. హిమాచల్‌ప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాల్లోని విహార కేంద్రాలూ చూడొచ్ఛు అరకు, ఊటీ, హార్స్‌లీహిల్స్‌, కొడైకెనాల్‌కు వెళ్లొచ్ఛు


ప్రకృతిలోకి..

ఆగస్టు 1-3, 12-16, 21-23

దీర్ఘ వారాంతాలతో ఆగస్టు పర్యాటకులను అనుగ్రహించింది. బక్రీద్‌, రక్షాబంధన్‌, జన్మాష్టమి, స్వాతంత్య్ర దినోత్సవం, వినాయకచవితి వంటి ముఖ్యమైన రోజులు ఈ నెలలో వచ్చాయి. ఒకట్రెండు రోజులు సెలవులు సర్దుబాటు చేసుకోగలిగితే చిన్నదో పెద్దదో టూర్‌ వేసుకోవచ్ఛు

ఇవి చూడండి: వర్షాకాలం కావడంతో ఎక్కడికి వెళ్లినా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. తమిళనాడు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర రాష్ట్రాల పర్యటనకు ఇది అనుకూల సమయం.


దసరాకు సరదాగా..

అక్టోబరు 17-25

ఈ నెల మూడో వారం నుంచి దసరా సెలవులు మొదలవుతున్నాయి. దసరా ఆదివారమే వచ్చినా.. ముందు రెండు రోజులు, తర్వాత రెండు రోజులు సెలవు తీసుకుంటే.. పల్లె‘టూరో’, పెద్దటూరుకో వెళ్లిపోవచ్ఛు

ఇవి చూడండి: దసరా సంబరాన్ని చూడాలంటే కోల్‌కతా, మైసూర్‌ వంటి నగరాలకు వెళ్లొచ్ఛు శృంగేరి, తిరుమల వంటి క్షేత్రాలు దర్శించొచ్ఛు రాజస్థాన్‌, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోని పర్యాటక కేంద్రాలకూ వెళ్లొచ్ఛు


దీపావళి వేళ..

నవంబరు 13-15

పర్యాటకానికి అనువైన మాసం నవంబరు. దీపావళి సెలవుల్లో చిన్న పర్యటనకు సిద్ధమవ్వండి. ఒకరోజు సెలవు పెట్టుకోగలిగితే, పండగ మర్నాడు ఆదివారం ఉండటంతో మూడు రోజులు కలిసి వస్తాయి. నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్రా నదికి పుష్కరాలున్నాయి. ఆ నదీ తీరంలో ఉన్న క్షేత్రాలను దర్శించుకోవచ్ఛు

ఇవి చూడండి: ఈ నెలలో. ఆధ్యాత్మిక యాత్రలకు ఎక్కువగా వెళ్తుంటారు. ట్రెక్కింగ్‌ ప్రియులు, సాహస యాత్రికులు కొండ ప్రాంతాలు చుట్టేసి వస్తుంటారు.


చివరగా

డిసెంబరు 25-27

ఆదివారం కలిసి రావడంతో క్రిస్మస్‌, బాక్సింగ్‌డే సెలవులు మూడు రోజులకు పెరిగాయి. ముందుగా ప్లాన్‌ చేసుకోగలిగితే 2020ని ఘనంగా ముగించొచ్ఛు ఈ విహారంలోనే 2021కి స్వాగతం పలికేయొచ్ఛు

ఇవి చూడండి: గోవా నుంచి కోవలం దాకా క్రిస్మన్‌, న్యూ ఇయర్‌ సందడికి కేరాఫ్‌గా నిలుస్తాయి. నేషనల్‌ పార్క్‌లు సందర్శించొచ్ఛు మహాబలిపురం, హంపి వంటి చారిత్రక నగరాలు చూడొచ్ఛు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.