కేఎల్‌ రాహుల్‌ను మూడు వన్డేల్లోనూ ఆడించాలి 
close

తాజా వార్తలు

Published : 23/03/2021 12:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేఎల్‌ రాహుల్‌ను మూడు వన్డేల్లోనూ ఆడించాలి 

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గంభీర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ను నేటి నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడు వన్డేల్లోనూ ఆడించాలని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో రాహుల్‌ పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. నాలుగు మ్యాచ్‌ల్లో 1, 0, 0, 14 అతడు సాధించిన పరుగులివి. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా చివరి టీ20లో అతడికి అవకాశమివ్వలేదు. అయితే, వన్డే సిరీస్‌లో ఆడించాలని గంభీర్‌ సూచించాడు. ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘ఫామ్‌లో లేని ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు. రాహుల్‌ ఇప్పుడు మూడు వన్డేల్లోనూ ఆడాలి. ఎవరైనా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతుంటే వారికి మరిన్ని అవకాశాలిచ్చి అండగా నిలవాలి. వారు మళ్లీ గాడిలో పడాలంటే అదొక్కటే మార్గం. ఎందుకంటే తుది జట్టు నుంచి తప్పిస్తే వారికది ఇబ్బందికరంగా ఉంటుంది’ అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా, రాహుల్‌ గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో అత్యధికంగా 670 పరుగులు చేశాడు. ఆపై ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడడంతో కొద్ది రోజులు జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు టీ20 సిరీస్‌లో అందుబాటులోకి వచ్చినా ఫామ్‌ కోల్పోయి సతమతమౌతున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని