ఇంగ్లాండ్‌ ఒక్క టెస్టు అయినా గెలుస్తుందనుకోవట్లేదు..
close

తాజా వార్తలు

Updated : 02/02/2021 10:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంగ్లాండ్‌ ఒక్క టెస్టు అయినా గెలుస్తుందనుకోవట్లేదు..

ముంబయి: భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో తలపడనున్న ఇంగ్లాండ్‌.. కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలుస్తుందని తాను అనుకోవట్లేదని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ఆ జట్టు బలహీనమైన స్పిన్‌ విభాగమే అందుకు కారణమని అతనన్నాడు. ఈ సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌.. స్పిన్నర్లు మొయిన్‌ అలీ, డామ్‌ బెస్, జాక్‌ లీచ్‌లను జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ‘‘ఇలాంటి స్పిన్‌ దాడితో ఇంగ్లాండ్‌ కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలుస్తుందని నాకు అనిపించట్లేదు. భారత్‌ ఈ సిరీస్‌ను  3-0తో లేదా బహుశా 3-1తో సొంతం చేసుకునే అవకాశం ఉంది. గులాబి బంతి మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుంటేనే ఇంగ్లాండ్‌కు ఆ ఒక్క అవకాశం ఉంటుంది. ఆ మ్యాచ్‌లోనూ విజయావకాశాలు 50-50 గానే ఉంటాయి. శ్రీలంకలో అద్భుత ప్రదర్శన చేసిన ఆ జట్టు కెప్టెన్‌ రూట్‌కు భారత్‌లో విభిన్నమైన సవాలు ఎదురు కానుంది. పిచ్‌ ఎలా ఉన్నా బుమ్రాను ఎదుర్కోవడం ప్రమాదకరమే. అశ్విన్‌తోనూ ముప్పు తప్పదు’’ అని అతను చెప్పాడు. వన్డేల్లో, టెస్టుల్లో కోహ్లి నాయకత్వాన్ని తానెప్పుడూ ప్రశ్నించలేదని, సమస్యల్లా టీ20ల్లోనే ఉందని గంభీర్‌ తెలిపాడు. ‘‘అవును.. కోహ్లి ఓ నాయకుడు. టెస్టుల్లో జట్టును గొప్పగా నడిపిస్తున్నాడు. జట్టులాగే అతను ఆనందంగా ఉంటాడని అనుకుంటున్నా. కానీ టీ20ల్లో అతని కెప్టెన్సీనే నేను ప్రశ్నిస్తూ వస్తున్నా. వన్డేల్లో లేదా టెస్టుల్లో అతని సారథ్యం బాగుంది’’ అని అతను పేర్కొన్నాడు.
ఇవీ చదవండి..
మా విజయంలో ద్రవిడ్‌ది కీలక పాత్ర: రహానె
నువ్వానేనా!


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని