
తాజా వార్తలు
బాలిక దినోత్సవం నాడు..రోడ్డు పక్కనే శిశువు!
పట్నా: జాతీయ బాలికా దినోత్సవం జరుపుకొంటున్నవేళ అప్పుడే పుట్టిన బాలికను రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రామ్‌పూర్‌లో చోటు చేసుకుంది. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు గమనించి చూడగా శిశువు కనిపించింది. వెంటనే వారు ఆ శిశువును రామ్‌పూర్ జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. చిన్నారిని పైనుంచి కింద పడేసినట్టు కనిపిస్తోందన్న వైద్యులు, చాలా విషమ పరిస్థితుల్లో శిశువును ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు తెలిపారు. తలపై గాయమైందని, ఎముకలు కూడా విరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేసిన వైద్యులు పరీక్షలు చేస్తునట్టు చెప్పారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలిస్తామని వైద్యులు అంటున్నారు.
ఇవీ చదవండి!
ఓపిక పడితే టీమ్ఇండియా వికెట్లు పడతాయి
భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి
Tags :