close

తాజా వార్తలు

Published : 18/07/2020 23:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో ఈ-ఆఫీస్‌ ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణలోని ఆరు శాఖల్లో  ప్రభుత్వం ఈ-ఆఫీస్‌ ప్రారంభించింది. సాధారణ పరిపాలన, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు, ఐటీ, సీసీఎల్‌ఏ, మహిళా-శిశుసంక్షేమ శాఖల్లో ఈ-సేవలను ప్రారంభించింది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఈ-ఆఫీస్‌ ప్రారంభించినట్లు సీఎస్‌ సోమేష్‌కుమార్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ఈ-ఆఫీస్‌ ప్రారంభమయ్యేలా పని చేసిన అధికారులకు సీఎస్‌ అభినందనలు తెలిపారు. దీని ద్వారా 1,600 మందికిపైగా ఉద్యోగులు పని చేస్తారని చెప్పారు.

‘‘ ఈ-ఆఫీస్‌ పూర్తి పారదర్శకత, ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతర శాఖలు కూడా ఈ-ఆఫీస్‌ విధానంలో పని చేయాలి. దీనివల్ల కాగితంతో సంబంధం లేకుండా ఎలక్ట్రానిక్‌ విధానంలో దస్త్రాల పరిష్కారమవుతాయి. ఈ విధానంతో సమయం ఆదా అవ్వడంతోపాటు  కాగితాలను పొదుపు చేయొచ్చు. పూర్తి జవాబుదారీతనం ఉండేందుకు ఈ-ఆఫీస్‌ విధానం చాలా అవసరం’’ అని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.