నేటి టెస్టులో అతడికి చోటు దక్కదు: గంభీర్‌
close

తాజా వార్తలు

Updated : 24/02/2021 12:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేటి టెస్టులో అతడికి చోటు దక్కదు: గంభీర్‌

ఇంటర్నెట్‌డెస్క్: మొతెరా వేదికగా భారత్‌×ఇంగ్లాండ్‌ మధ్య మరికాసేపట్లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. అయితే గులాబి బంతితో జరిగే ఈ టెస్టులో ఉమేశ్‌ యాదవ్‌కు భారత్‌ తుది జట్టులో చోటు దక్కదని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌ అన్నాడు. ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాతో కలిసి హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బంతిని పంచుకుంటాడని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడి ఉమేశ్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం నిర్వహించిన ఫిట్‌నెస్‌ పరీక్షలో అతడు పాసై ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి రెండు టెస్టులకు ఎంపికయ్యాడు.

‘‘భారత్‌ తుదిజట్టులో ఉమేశ్‌కు చోటు దక్కుతుందని నేను భావించట్లేదు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తే ఇషాంత్ శర్మ, బుమ్రా, సిరాజ్‌ ఉంటారు. సిరాజ్‌ ఎంతో ఆకట్టుకుంటున్నాడు. ఆస్ట్రేలియాలో, చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో చక్కగా బౌలింగ్ చేశాడు. అతడు బంతిని సంధిస్తున్న తీరు, వేగం ప్రశంసనీయం. ఈ ముగ్గురు పింక్‌ బాల్ టెస్టులో ఉంటారని నా అభిప్రాయం’’ అని గంభీర్‌ అన్నాడు.

నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్ చెరో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం. లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న ఫైనల్‌కు టీమిండియా అర్హత సాధించాలంటే సిరీస్‌ను కనీసం 2-1 తేడాతో విజయం సాధించాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని