close

తాజా వార్తలు

Updated : 10/04/2020 04:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మార్చిలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి రూ.11,485 కోట్లు

ఏడాది గరిష్ఠ స్థాయి

దిల్లీ: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి ఈ ఏడాది మార్చిలో రూ.11,485 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు మ్యూచువల్‌ ఫండ్ల సంఘం యాంఫీ వెల్లడించింది. ఇది ఏడాది గరిష్ఠ స్థాయి. 2019 మార్చిలో వచ్చిన రూ.11,756 కోట్ల పెట్టుబడుల తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రావడం ఇదే. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్నా, మ్యూచువల్‌ ఫండ్లలోకి ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం గమనార్హం. అయితే, మ్యూచువల్‌ ఫండ్ల పరిశ్రమ నుంచి నికరంగా సుమారు రూ.2.13 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తరలిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా లిక్విడ్‌/మనీ మార్కెట్ల విభాగం నుంచి ఎక్కువగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. గత ఫిబ్రవరిలో ఇలా వెనక్కి వెళ్లిన పెట్టుబడులు రూ.1,985 కోట్లు మాత్రమే.  మ్యూచువల్‌ ఫండ్ల పరిశ్రమలోని 44 సంస్థల వద్ద నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏయూఎమ్‌) మార్చి ఆఖరుకు రూ.22.26 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని