
తాజా వార్తలు
సుప్రీం తీర్పునకు కట్టుబడి ఉండాలి: రామకృష్ణ
అమరావతి: పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కట్టుబడి ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగాలని.. ఈ విషయంలో పంతానికి పోవడం మంచిది కాదన్నారు. వ్యాక్సిన్ పంపిణీ అనేది కేవలం కుంటిసాకు మాత్రమేనని.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఉద్యోగ సంఘాలు అమలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగాలని.. ఈ విషయంలో ప్రభుత్వం ఎస్ఈసీకి సహకరించాలన్నారు. ఎన్నికలు జరిగాయి కాబట్టే వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని ఈ సందర్భంగా రామకృష్ణ గుర్తు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఏమైనా ఇబ్బందులుంటే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి చెప్పాలన్నారు. అంతేకానీ ఉద్యోగ సంఘాలు ఇబ్బందికర వ్యాఖ్యలు చేయకూడదని రామకృష్ణ సూచించారు.
ఇవీ చదవండి..
గవర్నర్ జోక్యం చేసుకోవాలి: యనమల
ఎన్నికలపై ఎస్ఈసీకి నమ్మకం లేదు: వెంకట్రామిరెడ్డి