close

తాజా వార్తలు

Published : 24/01/2021 17:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 44,382 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 158 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,87,010కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,147 మంది బాధితులు మృతి చెందారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 155 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,78,387కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,476 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,28,76,113 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

ఇవీ చదవండి..

జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌

బాగ్‌లింగంపల్లిలో అఖిలపక్ష భేటీ



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
జాతీయ- అంతర్జాతీయ
పాలిటిక్స్
సినిమా
క్రీడలు
క్రైమ్