close

తాజా వార్తలు

Updated : 02/12/2020 10:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో కొత్తగా 565 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 51,562 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 565 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,70,883కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న  కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,462కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 925 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,60,155కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,266 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 7,219 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 55,51,620కి చేరింది.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని