
తాజా వార్తలు
తెలంగాణలో కొత్తగా 925 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,077 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 925 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,62,653కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,426కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 1,367 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,49,157కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,070 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 9,714 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 50,92,689కి చేరింది.
Tags :
జనరల్
జిల్లా వార్తలు