close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 08/05/2020 07:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విధిరాత.. విధుల్లోనే మృత్యువాత

ప్రమాదానికి గురైన వాహనం ఫొటో తీస్తూ కానిస్టేబుల్‌ దుర్మరణం

చౌటుప్పల్‌గ్రామీణం : విధిరాతను ఎవరూ మార్చలేరంటుంటారు..పాపం ఓ కానిస్టేబుల్‌ విషయంలో విధి నిర్దయగా ప్రవర్తించింది. విధుల నిర్వహణలో భాగంగా ప్రమాదానికి గురైన ఓ వాహనాన్ని ఫొటో తీస్తుండగా ఆ వాహనమే మృత్యుశకటమైంది. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ ఠాణా పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం దండుమల్కాపురం పంచాయతీ పరిధిలోని బొర్రొళ్లగూడెం స్టేజీ వద్ద నిలిచి ఉన్న గుర్తు తెలియని రవాణా వాహనాన్ని వెనక నుంచి గూడ్స్‌ ఆటో ఢీకొట్టింది. ముందు నిలిపి ఉన్న వాహన డ్రైవర్‌ బండితో సహా పారిపోయాడు. ఆటో డ్రైవర్‌ 100 నంబరుకు సమాచారమివ్వడంతో చౌటుప్పల్‌ పెట్రోలింగ్‌ వాహనం-2లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ఏర్పుల జగన్నాథం(49) ఘటనా స్థలికి చేరుకున్నారు. గూడ్సు ఆటో ముందు నిలబడి ఫొటోలు తీస్తుండగా ఈ సమయంలో కోల్‌కతా నుంచి షోలాపుర్‌కు వెళ్తున్న డీసీఎం వాహనం అదుపు తప్పి గూడ్స్‌ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో ముందుకు దూసుకొచ్చింది. కానిస్టేబుల్‌ను బలంగా ఢీకొనడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి ఎల్బీనగర్‌ కామినేని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కానిస్టేబుల్‌ స్వస్థలం నార్కట్‌పల్లి మండలం వెంకటాపూర్‌ కాగా కొన్నేళ్ల నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నారు. మృతదేహానికి రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తదితరులు పూలమాల వేసి నివాళి అర్పించారు. డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.