close

తాజా వార్తలు

Updated : 07/03/2021 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంటుంది: కేసీఆర్‌

సమావేశాలు, బడ్జెట్‌ రూపకల్పనపై సీఎం సమీక్ష

హైదరాబాద్: మార్చి నెల మధ్యలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. 2021-22 బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంటుందని వెల్లడించారు. వార్షిక బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, సీఎస్‌ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఇతర ఉన్నఅధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం సమావేశమయ్యారు. సమావేశాల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పన సంబంధిత అంశాలపై సమీక్షించారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగిస్తామన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.50 వేల కోట్ల మేర ఆదాయం తగ్గగా.. మొత్తంగా నష్ట ప్రభావం రూ.లక్ష కోట్లకు చేరుకుందని చెప్పారు.

రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకున్నాయని కేసీఆర్ అన్నారు. వివిధ రూపాల్లో ప్రభుత్వ రాబడి పెరుగుతోందని వెల్లడించారు. గత బడ్జెట్‌ కంటే ఈసారి కేటాయింపులు ఎక్కువగానే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు బడ్జెట్‌ అంచనాలు, కేటాయింపులు, విధివిధానాలు ఖారారు చేయాల్సిందిగా అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందని.. ఎప్పటిలాగే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 3.70 లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశామని.. మరో 3 లక్షల యూనిట్ల పంపిణీకి బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నట్లు వెల్లడించారు. చేపల పెంపకం కార్యక్రమం గొప్పగా సాగుతోందన్నారు. సత్ఫలితాలు వస్తున్నందున చేపల పెంపకాన్ని కొనసాగిస్తామన్నారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని