
తాజా వార్తలు
ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించండి: కేసీఆర్
త్రిసభ్య కమిటీకి సీఎం ఆదేశం
హైదరాబాద్: వేతన సవరణ, సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని త్రిసభ్య కమిటీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. వేతన సవరణ సంఘం కొద్దిరోజుల క్రితం సీఎంకు నివేదిక సమర్పిచింది. నివేదికను పరిశీలించిన సీఎం కేసీఆర్.. సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్‌కుమార్‌తో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో పీఆర్సీ, పదోన్నతులు, ఇతర సమస్యలపై చర్చలు ప్రారంభించాలని.. వారం, పదిరోజుల్లో చర్చలు పూర్తిచేయాలని సీఎస్‌ను కేసీఆర్ ఆదేశించారు. చర్చలు జరిపిన అనంతరం త్రిసభ్య కమిటీ సీఎంకు నివేదిక అందించనుంది. ఆ నివేదిక ఆధారంగా మంత్రివర్గంలో చర్చించిన అనంతరం వేతన సవరణపై రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది.
ఇవీ చదవండి..
యాదాద్రి.. కేసీఆర్ కలల ప్రాజెక్టు: కేటీఆర్
తిరుపతి ఉపఎన్నికే పునాది..: సోము వీర్రాజు