సీఎస్‌కు ఆ విషయం తెలీదేమో: భట్టి
close

తాజా వార్తలు

Published : 05/05/2021 19:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎస్‌కు ఆ విషయం తెలీదేమో: భట్టి

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉద్ధృతితో వైద్యం అందక ప్రజలు చనిపోతుంటే.. ఇదే సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం సరైంది కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ స్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో భట్టి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సరైన టెస్టులు లేవు, వాక్సినేషన్‌కు ఎలాంటి ప్రణాళిక లేదని ఆరోపించారు. కొవిడ్ పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు ప్రజలను దోచుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతో వ్యవహరించిందని భట్టి గుర్తు చేశారు.

‘‘వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. అడవులు, తండాల్లో నివసించే వారికి రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకోవాలో ఎలా తెలుస్తుంది? తెలంగాణలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు చనిపోతున్న విషయం ఆయనకు తెలియడం లేదనుకుంటాను. బాధ్యతగల స్థానంలో ఉన్న సీఎస్‌ ఇలా అబద్ధాలు ఆడటం సరైంది కాదు. ఒక ఇంజక్షన్ కోసం నేను అనేక మందికి ఫోన్‌ చేసి అడిగాను. ఎక్కడా దొరకలేదు. నాకే ఇలాంటి పరిస్థితి ఉంటే మరి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి?రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొవాలి’’ అని భట్టి తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని